భువనేశ్వర్: ప్రియురాలి బాగోగులు చూసేందుకు ఓ ప్రేమికుడు బాబా అవతారం ఎత్తాడు. ప్రేమికుడి విషయం బట్టబయలైంది.  ప్రియుడు దొంగబాబా అవతారం ఎత్తడంతో స్థానికుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు.

జాజ్‌పూర్ రోడ్ ఫెర్రో క్రోమ్ గేటు కాలనీలో శనివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది. బాబా వేషంలో తిరుగుతున్న ప్రియుడిని పిల్లలు ఎత్తుకుపోయే దొంగగా భావించిన స్థానికులు పట్టుకొని చితకబాదారు.  

అంగుల్ లో 12వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని ప్రేమించాడు. విద్యార్ధిని కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు ఒప్పుకోలేదు. దీంతో ప్రియురాలి  ఇంట్లో తాజా పరిస్థితులను తెలుసుకొనేందుకు ఆమెను కలవాలనుకొన్నాడు.  ఆమెను కలిసేందుకు దొంగ బాబా వేషం వేశాడు.  ప్రియురాలి ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న అతడిని  స్థానికులు దొంగగా భావించి పట్టుకొని చితకబాదారు. 

బాబాగా అవతారం ప్రేమికుడు స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు నిజాన్ని ఒప్పుకొన్నాడు. నిందితుడి గడ్డం పెనులాగటలో ఊడిపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది.నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు.