Asianet News TeluguAsianet News Telugu

Odisha Train Tragedy: మృతదేహాలు ఉంచిన స్కూల్ కూల్చేసిన అధికారులు.. ఎందుకంటే?

ఒడిశా రైలు దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలు సమీపంలోని బహనాగ ప్రభుత్వ హాస్పిటల్‌లో తాత్కాలికంగా ఉంచారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీలను భువనేశ్వర్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ భారీ మొత్తంలో శవాలను స్కూల్‌లో చూసిన స్థానికులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపించబోమని చెప్పారు. దీంతో అధికారులు శుక్రవారం ఆ భవనాన్ని కూల్చేశారు.
 

odisha train tragedy, school in which deadbodies stored for briefly demolished kms
Author
First Published Jun 9, 2023, 9:26 PM IST

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో సుమారు 288 మంది మరణించారు. ఈ ఘటన  దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ప్రజలకు ఇప్పటికీ ఇది పీడకలగా వెంటాడుతూనే ఉన్నది. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను అధికారులు తాత్కాలికంగా సమీపంలోని బహనాగ ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. ఆ తర్వాత డెడ్ బాడీలను భువనేశ్వర్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ ప్రభుత్వ పాఠశాలను శుభ్రం చేసి మళ్లీ పిల్లలు చదువుకోవడానికి సిద్ధం చేసి పెట్టారు.

అయితే, భారీ మొత్తంలో శవాలను చూసిన స్థానికులు కొన్ని రోజుల వరకు షాక్‌లోనే ఉండిపోయారు. ఆ డెడ్ బాడీలు తమ ఊరి ప్రభుత్వ పాఠశాలలో చూసి ఖంగుతిన్నారు. కుప్పలుగా ఉంచిన శవాల దృశ్యాలు ఇప్పటికీ వారిని వెంటాడుతున్నాయి. అయితే, ఈ నెల 16వ తేదీన మళ్లీ స్కూల్ ప్రారంభం కానుంది. చిన్న పిల్లలు మళ్లీ ఈ స్కూల్ వెళ్లాల్సి ఉన్నది.

Also Read: బెల్లంపల్లి ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై యువతి ఎన్‌సీడబ్ల్యులో ఫిర్యాదు: విచారణకు ఆదేశం

కానీ, ఆ శవాల దృశ్యాలు చూసిన స్థానికులు ఆ బడి వైపు చూడాలంటే బెంబేలెత్తిపోతున్నారు. పిల్లలూ అంతే. ఆ స్కూల్‌కు పిల్లలను పంపబోమని, పిల్లలూ భయపడుతున్నారని స్థానికులు తమ భయాలను బయటపెట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూల్‌కు పంపించబోమని చెబుతున్నారని హెడ్ మాస్టర్ ప్రమీలా స్వేన్ తెలిపారు. అలాగే.. సుమారు 6 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ స్కూల్ భవనం కూడా దెబ్బతిన్నదని వివరించారు. ఈ స్కూల్ భవనాన్ని కూల్చి నూతనంగా భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ స్కూల్ అధికారులు కోరారు.

దీంతో బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ షిండే బహనాగ స్కూల్‌కు గురువారం వెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత ఆ స్కూల్ భవనం కూల్చివేతకు అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతులు వచ్చిన తర్వాత శుక్రవారం భవనాన్ని కూల్చేశారు. అదే ప్రదేశంలో నూతన భవనాన్ని అధికారులు నిర్మించనున్నారు. 

నూతన భవనం నిర్మాణమయ్యాక పిల్లలు ఎలాంటి భయాలు లేకుండా స్కూల్‌కు వస్తారని ఉపాధ్యాయులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios