ముమ్మాటికీ సిగ్నలింగ్ లోపమే.. ఒడిశా రైలు దుర్ఘటనపై తాజా సమాచారం..
Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 56 మంది విషమంగా ఉన్నట్టు , మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Odisha Train Accident: దాదాపు 2,000 మంది ప్రయాణికులతో వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఒడిశాలోని బాలాసోర్ బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యాయి.
ఒడిశా రైలు దుర్ఘటనపై తాజా సమాచారం:
1. ఒడిశా రైలు దుర్ఘటనలో ఇప్పటివరకు 288 మంది మరణించగా.. 800 మందికి పైగా గాయపడినట్లు ఆగ్నేయ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెఎస్ ఆనంద్ తెలిపారు. అలాగే.. గాయపడిన వారిలో 56 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్టు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
2. రెస్క్యూ ఆపరేషన్ శనివారం సాయంత్రం వరకు ముగిసింది. అనంతరం పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. ఈ ప్రమాదం కారణంగా 150కి పైగా రైళ్లు రద్దు చేయబడ్డాయి. పలు రైలుదారి మళ్లించబడ్డాయి. మరికొన్నింటిని షార్ట్‌టర్మినేట్ చేశారు.
3. ప్రాథమిక విచారణ నివేదిక ప్రకారం.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు మెయిన్ లైన్‌లోకి వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చి.. వెంటనే రద్దు చేయడంతో రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. దీంతో అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు వెల్లడైంది .
4. ఈ ఘోర ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సిగ్నలింగ్ వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణమని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి ప్రవేశించి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిందా? లేదా రైలే పట్టాలు తప్పిందా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని రైల్వే అధికారులు తెలిపారు.
5 .ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘటనాస్థలిని సందర్శించి ప్రమాదాన్ని పరిశీలించారు. దేశంలోనే అత్యంత విషాదకరమైన ప్రమాదాల్లో ఒకటిగా పేర్కొన్నారు.
6. ప్రధాని మోదీ ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను సమీక్షించారు. క్షతగాత్రులను తరలించిన ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించారు. ఈ సమయంలో మాట్లాడుతూ.. "నా బాధను వ్యక్తపరచడానికి నా దగ్గర మాటలు లేవు.. ఎవరినీ విడిచిపెట్టేది లేదు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. విషాదంపై సరైన, వేగవంతమైన దర్యాప్తు జరిగేలా ఆదేశాలు ఇవ్వబడ్డాయి" అని మోడీ చెప్పారు .
7. క్షత్రగాత్రులును ప్రైవేట్‌తో సహా 1,175 మంది వివిధ ఆసుపత్రులలో చేరారు. వారిలో 793 మంది డిచార్జ్ చేశారు. 382 మంది చికిత్స పొందుతున్నారని ఒడిశా ప్రభుత్వ అధికారులు తెలిపారు.
8. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి ₹ 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹ 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹ 50,000 ఎక్స్ గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది . ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబీకులకు ₹ 2 లక్షలు, గాయపడిన వారికి ₹ 50,000 అదనపు ఎక్స్‌గ్రేషియాను మోదీ ప్రకటించారు . ఇతర రాష్ట్రాలు కూడా సహాయాన్ని ప్రకటించాయి.
9. ఈ ఘోర ప్రమాదం సిగ్నలింగ్ లోపంతోనే జరిగిందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్లనే మొయిన్ లైన్ మీద వెళ్లాల్సిన రైలు లూప్ లైన్‌లోకి వెళ్లిందనీ, అలా వెళ్లిందంటే సిగ్నలింగ్ వ్యవస్థలో వైఫల్యమని అంటున్నారు.
10. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, భువనేశ్వర్‌కు మరియు బయటికి వచ్చే విమాన ఛార్జీలు ఏవైనా అసాధారణంగా పెరిగినట్లయితే.. వాటిని పర్యవేక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను కోరింది.