సారాంశం
ఒడిశా బాలాసోర్ కోరమండలల్ రైలు ప్రమాదంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
న్యూఢిల్లీ:బాలాసోర్ రైలు ప్రమాదంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ నిర్వహించాలని కోరుతూ ఆదివారంనాడు సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. రైల్వే శాఖలో ప్రజల ప్రాణాల రక్షణకు గాను రైల్వేలలో కవాచ్ ప్రొటెక్షన్ సిస్టం అమలుకు ఆదేశాలను ఆ పిల్ లో కోరింది. రైల్వే వ్యవస్థలో ప్రస్తుత ప్రమాదాలకు లోపాలు , భద్రతను మరింత పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిపుణుల కమిటీ సూచనలను
పిటిషనర్ కోరారు.
విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. భారతీయ రైల్వేలో కవాచ్ సిస్టమ్ అమలుకు మార్గర్శకాలను కూడ పిటిషనర్ కోరారు. కవాచ్ అమలు చేస్తే రెండు రైళ్లు ఒకే లైన్ లో ఎదురెదురుగా వస్తే ఆటోమెటిక్ గా రైళ్లకు బ్రేకులు పడుతాయి. లేకా రైళ్లు వెనక్కి నడుస్తాయి. బాలాసోర్ లో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. 800 మందికి పైగా గాయపడ్డారు.