Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా రైలు ప్రమాదం : 233 కు చేరిన మృతులు.. 43 రైళ్లు రద్దు, 38 రైళ్ల దారి మళ్లింపు..

ఒడిశాలోని బాలేశ్వర్ శుక్రవారం సాయంత్రం జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం కారణంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 233కు చేరుకుంది. 43 రైళ్లు రద్దు చేశారు.  38 రైళ్ల దారి మళ్లించారు.

Odisha train accident : death toll reached 233, 48 trains cancelled, 38 trains diverted - bsb
Author
First Published Jun 3, 2023, 7:23 AM IST

ఒడిశా :  ఒడిశాలో శుక్రవారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదం వందలాది మందిని బలి తీసుకుంది. ఇప్పటికే మృతుల సంఖ్య 233 కు చేరుకుంది. దాదాపు 900 మందికి పైగా క్షతగాత్రులు అయినట్టు అధికారిక సమాచారం. వీరిలో చాలామంది పరిస్థితి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మూడు రైళ్లు ఒకదానికొకటి గుద్దుకోవడంతో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో.. కోరమండల్ ఎక్స్ప్రెస్ కు చెందిన 15 భోగీలు పట్టాలు తప్పాయి. ఆ బోగీలు దూసుకెళ్లి మరో పట్టాల మీద వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఇలా ఒక దానికి మరొకటి మూడు రైళ్లు గుద్దుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

 రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి రైల్వే శాఖ రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిమీద విచారణ చేపట్టనుంది. శుక్రవారం రాత్రి 7 గం.ల సమయంలో ప్రమాదం జరగగా.. ఇంకా భోగీల్లో నుంచి ప్రయాణికులను బైటికి తీస్తూనే ఉన్నారు. ఇంకా భోగీల్లో చాలామంది ఉండిపోయారు. 

Coromandel Express: ఘోర ప్రమాదం.. 70 దాటిన మృతుల సంఖ్య.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం..

ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు.   దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్ళను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. టాటా నగర్ స్టేషన్ మీదుగా మరో ఏడు రైల్లు దారి మళ్లించినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలను వెల్లడించారు. ప్రయాణికులు ఈ వివరాలను  ఫాలో అవ్వాలని కోరారు.  రద్దయిన రైల్లు ఇవే.. 

హావ్ డా-పూరీ సూపర్ ఫాస్ట్ (12837)
హావ్ డా బెంగళూరు సూపర్ ఫాస్ట్ (12863)
హావ్ డా-చెన్నై మెయిల్
హావ్ డా- సికింద్రాబాద్ (12703)
హావ్ డా-హైదరాబాద్ (18045)
హావ్ డా-తిరుపతి (20889)
హావ్ డా- పూరి సూపర్ ఫాస్ట్(12895) 
హావ్ డా- సంబల్ పుర్ ఎక్స్ ప్రెస్ (203831) 
సంత్రగాచి-పూరీ ఎక్స్ ప్రెస్ (02837) 

ఇక బెంగళూరు -గువాహటి (12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్ళించారు.  ఖరగ్పూర్ డివిజన్ లో  ఉన్న చెన్నై సెంట్రల్-హావ్ డా (12840) రైలును జరోలీ మీదుగా,  వాస్కోడిగామా-షాలిమార్ (18058), సికింద్రాబాద్- షాలిమార్ (22850) వారాంతపు రైళ్లను కటక్ అంగోలు మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం నేపథ్యంలో.. గోవా ముంబై వందే భారత్ రైలు ప్రారంభం వాయిదా పడింది. మడ్గావ్ స్టేషన్ నుంచి ప్రారంభించాల్సిన గోవా ముంబై వందే భారత్ రైలు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లుగా కొంకన్ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు.  ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం ప్రధాని మోదీ వెర్చువల్ పద్ధతిలో ఈ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios