బంగాళాఖాతంలో ఏర్పడిన యస్ తుఫాను ఉగ్రరూపం దాల్చింది.  అతి తీవ్ర తుఫాన్‌గా మారి బాలసోర్ సమీపంలో తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. వాయవ్య దిశగా కదులుతున్న తుఫాన్ క్ర‌మంగా బలహీనపడుతున్న‌ద‌ని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. యాస్ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి.

ఇలాంటి సమయంలో..  ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ.. ఓ వ్యక్తి భయంకరమైన తుఫానులో బయటకు వచ్చి మీడియాకు చిక్కాడు.

 

దీంతో.. ఓ మీడియా పర్సన్.. సదరు వ్యక్తి.. తుఫాన్ ఇంత భయంకరంగా ఉంది కదా.. బయటకు రావద్దని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. మీరు బయటకు ఎందుకు వచ్చార్ సర్ అని అడిగాడు.

వెంటనే.. ఆ వ్యక్తి.. నువ్వు బయటకు వస్తే.. లేని తప్పు.. నేను వస్తే ఎలా తప్పు అవుతుందంటూ ఆ మీడియా రిపోర్టర్ తో పేర్కొన్నాడు. అయితే.. తాను న్యూస్ కవర్ చేయడానికి వచ్చానని ఆ న్యూస్ రిపోర్టర్ చెప్పగా.. దానికి ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం హైలెట్ గా నిలిచింది.

నేను బయటకు రాకపోతే.. మీరు న్యూస్ లో ఎవరిని చూపిస్తారు.. మీకోసమే నేను బయటకు వచ్చానంటూ అతను చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రాగా.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.