Asianet News TeluguAsianet News Telugu

ఇదో వింత సాంప్రదాయం: అక్కడ పూజారి కాలితో..

దసరా పండగ సందర్భంగా వాహనపూజకోసం గుడికి వెళ్లిన భక్తుల తలపై ఓ పూజారి కాలుపెట్టి ఆశీర్వదించాడు. ఈ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇప్పుడిది వైరల్ గా మారింది. 

odisha priest blesses with foot on head: calls it a tradition
Author
Puri, First Published Oct 12, 2019, 8:28 AM IST

పూరీ: దసరా పండుగరోజు చోటుచేసుకున్న ఒక వివాదాస్పద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేతితో కాకుండా కాలితో ఒక పూజారి ఆశీర్వాదం ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరిగిన ఈ సంఘటన నెట్టింట వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే, దసరా పండగ సందర్భంగా వాహనపూజకోసం గుడికి వెళ్లిన భక్తుల తలపై ఓ పూజారి కాలుపెట్టి ఆశీర్వదించాడు. ఈ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇప్పుడిది వైరల్ గా మారింది. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పైన పూజారి స్పందిస్తూ తన చర్యను సమర్థించుకున్నారు. ఇలా తలపై కాలుపెట్టి ఆశీర్వదించే సాంప్రదాయం ఎప్పటినుండో ఆ గుడిలో కొనసాగుతున్నట్టు తెలిపాడు. ఇతని వివరణపై నెటిజెన్ల దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదెక్కడి వింత సాంప్రదాయమంటూ వాపోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios