ఏకాంతంగా గడుపుతున్న ప్రేమ జంటపై స్థానికులు దారుణంగా ప్రవర్తించారు. ప్రేమ జంట పై దాడి చేసి గుండు కొట్టించారు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఓ యువకుడు తన ప్రియురాలితో ఏకాంతంగా గడపుతుండగా.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు ఇద్దరిని విచక్షణా రహితంగా చితకబాదారు. అందరి ముందు గుండు కొట్టించారు. ఈ ఘటన మయూర్‌భంజ్‌, కరంజిలా బ్లాక్‌లోని మండువా గ్రామంలో గత శనివారం  చోటుచేసుకుంది. 

వారిద్దరికి గుండు కొట్టించడమే కాకుండా సెలఫోన్లలో ఫొటోలు తీశారు. అవి కాస్త సోషల్‌మీడియా వేదికగా వైరల్‌ కావడంతో పోలీసులు దృష్టికి వచ్చింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇక మేజర్లైన యువతీ యువకులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే