ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో భారీ రైలు ప్రమాదం తప్పింది. MEMU ప్యాసింజర్, గూడ్స్ రైలు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో అవుతోంది. ఈ ఘటన చూసిన ప్రయాణికుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. మరికొందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటికీ ఈ ప్రమాదంపై అనేక ఆరోపణలు, సందేహాలు వస్తున్నాయి. అలాగే ఆ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు నేటీకీ అందరి కండ్ల ముందు మొదలుతున్నాయి. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు విచారం చేస్తున్నాయి. అయితే.. ఈ ఘటన మరువకముందే.. మరో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.
వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో భారీ రైలు ప్రమాదం తప్పింది. MEMU ప్యాసింజర్, గూడ్స్ రైలు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి, ఆటోమేటిక్ సిగ్నల్ ఫంక్షన్ ఉందని, ఎటువంటి లోపం సమస్య లేదని రైల్వే చెబుతోంది. ఈ ఘటనను ప్రయాణికులు వీడియో తీశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాయ్‌పూర్ నుంచి బిలాస్‌పూర్ నుంచి కోర్బా వెళ్లే మెము రైలును మధ్య ట్రాక్‌పై నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్యాసింజర్ రైలును ఆపిన తర్వాత అదే ట్రాక్‌పై 100 కి.మీ దూరంలో గూడ్స్ రైలు నిలబడి ఉండటం కనిపించింది. ఒకే ట్రాక్‌పై రెండు వాహనాలు ఎదురెదురుగా రావడంతో ప్రయాణికుల్లో అలజడి నెలకొంది. ప్రయాణికులు తమను తాము అదృష్టవంతులుగా భావించారు. అదే సమయంలో లోకో పైలట్ అవగాహన వల్లే పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.
సమాచారం ప్రకారం సౌత్ జోన్‌లోని బిలాస్‌పూర్ రైల్వే డివిజన్‌లో రాయ్‌పూర్-కోర్బా MEMU రైలు.. రాయ్‌పూర్ నుండి కోర్బాకు వెళ్తోంది. అదే సమయంలో గూడ్స్ రైలు జైరాంనగర్ నుండి వస్తోంది. ఈ రెండు రైలు కొట్మిసోనార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎదురెదురుగా వచ్చాయి. ఈ దీంతో అప్రమత్తమైన లోకో ఫైలెట్స్ వెంటనే రైళ్లను నిలిపివేశారు. దీంతో ఆ రెండు రైలు దాదాపు 100-200 మీటర్ల దూరంలో ఆగిపోయాయి. ఘటన తర్వాత రైలులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి ఘటనను వీడియో తీయడం ప్రారంభించారు. ఆ వీడియోలను నెట్టింట్లో అప్ లోడ్ చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం
ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 12864 (యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్) రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి ప్రక్కనే ఉన్న ట్రాక్‌పై వేగంగా వస్తున్న రైలు 12841 (కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్)ని ఢీకొన్నాయి. కోరమాండల్ రైలులోని 17 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1000 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం రైలు ప్రమాదంపై విచారణ జరుగుతోంది.
