ప్రియురాలికి జీవితంలో మరిచిపోని అనుభవాన్ని పరిచయం చేసిన ప్రియుడు.. వీడియో కాల్ మాట్లాడుతూ.. ఏం చేశాడంటే..?
ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాజ్‌పూర్ జిల్లా ధామశాలకు చెందిన 23 ఏళ్ల మనోజ్ కుమార్ బెహెరా, కటక్‌లోని శ్రీశ్రీ యూనివర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

ఈ జీవితం ఓ అందమైన ప్రయాణం.. అందులో ఎన్నో ఆటుపోట్లు..ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి. వాటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పడే .. ఈ జీవితం పరిపూర్ణం అవుతోంది. ఏ సమస్యకు ఒక్క క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇబ్బందుల పాలు కావోద్దు. ప్రస్తుతం చాలా మంది యువత .. క్షణికావేశానికి లోనవుతూ.. తమ అందమైన జీవితాలను 20 ఏళ్ల లోపే ముగించేసుకుంటున్నారు. తాజాగా ఒడిస్సాలోని కటక్ లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
కటక్‌లో 23 ఏళ్ల కాలేజీ విద్యార్థి తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. నివేదికల నుండి అందిన సమాచారం ప్రకారం, బాధిత విద్యార్థిని రక్షించలేకపోయింది, బాలిక అతని ఇంటికి చేరుకుని పొరుగువారికి తెలియజేయడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని జాజ్‌పూర్ జిల్లా ధమశాలకు చెందిన మనోజ్ కుమార్ బెహెరాగా గుర్తించారు. కటక్‌లోని శ్రీశ్రీ యూనివర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న మనోజ్ కుమార్ జిల్లాలోని సంధాపూర్ గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
జాతీయ మీడియా నివేదిక ప్రకారం... మనోజ్ తన అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌కు కొద్ది దూరంలో నివసించే ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరూ వీడియో కాల్‌లో ఉన్నప్పుడు.. ప్రియుడు మనోజ్ ఆత్యహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విద్యార్థి తన ల్యాప్‌టాప్ నుండి తన స్నేహితురాలితో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఆ జంట మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ యువకుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలు వీడియో కాల్‌లో ఉండగానే డోర్‌ను లాక్ చేశాడు. గదిలోని రూఫ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, ఇది చూసిన ఆ యువతి షాక్ అయ్యింది. వెంటనే పరుగెత్తుకుని ప్రియుడి ఇంటి వద్దకు వెళ్లింది. తలుపులు బలంగా కొడుతూ బోరున ఏడ్చింది. గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఉరికి వేలాడుతున్న మనోజ్‌ను వెంటనే ఎస్‌సీబీ వైద్య కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. యువకుడి ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అతడి ప్రియురాలిని ప్రశ్నిస్తున్నారు.