Odisha: కరోనా సోకిన ప్రభుత్వ ఉద్యోగులకు వారం సెలవు

Odisha: ఒడిశాలోని ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్-19 బారిన పడితే ఒక వారం పాటు సెలవు తీసుకోవచ్చని రాష్ట్రప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది.మెడికల్ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత వ్యవధిని పొడిగించవచ్చని ఒడిశా సర్కారు పేర్కొంది.
 

Odisha Covid infected government employees to get one-week leave. See details

Odisha:  దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ వైర‌స్ వ్యాప్తి పెరుగుతుండటంతో దేశ‌వ్యాప్తంగా   ఆందోళన నెలకొంది. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు నమోదయ్యాయి. ఇప్ప‌టికే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మయ్యాయి. ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఒడిశా ప్రభుత్వం .. ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

ప్ర‌భుత్వ ఉద్యోగులు  కోవిడ్-19 బారిన పడితే.. ఒక వారం పాటు సెలవు తీసుకోవడానికి అనుమతించింది. రాష్ట్రప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది. మెడికల్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత సెలవు వ్యవధిని పొడిగించవచ్చని ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది
 

ప్రస్తుతం మూడవ కొవిడ్ వేవ్ ఉన్న పరిస్థితిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లయితే ఏడు రోజుల సెలవును అనుమతించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆదేశం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ మేర‌కు ప్ర‌బుత్వం సోమవారం అధికారిక నోటిఫికేషన్ ను విడుద‌ల చేసింది. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులకు వైరస్ పాజిటివ్ అని తేలితే 14 రోజుల సెలవు అనుమతించారు.

నోటిఫికేషన్ ప్రకారం..ప్రస్తుతం మూడవ కోవిడ్ వేవ్ ఉన్న పరిస్థితిలో, ఎవరైనా ఉద్యోగి కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లయితే ఏడు రోజుల సెలవును అనుమతించాలని నిర్ణయించబడింది. ఈ ఆదేశం తక్షణం అమల్లోకి వస్తుంది. అంతకుముందు, వైరస్‌కు పాజిటివ్ పరీక్షించిన ప్రభుత్వ ఉద్యోగులకు 14 రోజుల సెలవు అనుమతించబడింది.

 ఇదిలా ఉంటే..  గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఒడిశా ప్రభుత్వం సోమవారం రాత్రి కర్ఫ్యూను ఒక గంట సడలించింది. అలాగే.. పాఠశాలల్లో సరస్వతి పూజను అనుమతించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటలకు కాకుండా రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

కోవిడ్-19 ప్రోటోకాల్ కు లోబడి భక్తులు పాల్గొనకుండా దేవాలయాలలో పరిమిత సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో సరస్వతి పూజ అనుమతించాల‌ని నిర్ణ‌యించారు. సామూహికంగా సరస్వతి పూజలు అనుమతించబడవు. మాఘ సప్తమి నాడు స్నానానికి నదీ తీరాలు, ఘాట్‌లు, చెరువులు, బీచ్‌ల వద్ద పెద్ద సంఖ్య‌లో అనుమతించరు.

దుకాణాలు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, హాట్‌లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్‌లు, థియేటర్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు మరియు ఇతర  బ‌హిరంగ‌ ప్రదేశాలు ఉదయం 5 నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేయడానికి అనుమతించారు. ఇత‌ర ఆంక్షలను నోటిఫికేషన్‌లో పేర్కొంది.  

రాత్రి కర్ఫ్యూ సమయంలో రెస్టారెంట్లు, ఆన్‌లైన్ అగ్రిగేటర్ల ద్వారా అత్యవసర సేవలు, హోమ్ డెలివరీ సేవ‌లు కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, స్వయంప్రతిపత్త సంస్థల్లో సిబ్బంది కోవిడ్-19 ప్రోటోకాల్‌కు ఖ‌చ్చితంగా పాటించాల‌ని పేర్కొన్నారు. ఆన్‌లైన్ సమావేశాలను ప్రోత్సహించాలని నోటిఫికేషన్‌లో ఒడిశా ప్ర‌భుత్వం పేర్కొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios