Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికపై పోలీసుల సామూహిక అత్యాచారం.. గర్భం రావడంతో..

మర్నాడు బాలికను ఆమె ఇంటికి చేర్చారు. 3 నెలల పాటు క్రమం తప్పకుండా స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించారు. వచ్చిన ప్రతిసారి పై అంతస్తులో విడిది కల్పించి స్టేషన్‌లో సిబ్బంది వంతుల వారీగా బాలిక పట్ల లైంగికదాడికి పాల్పడ్డారు.  
 

odisha and police station staff molested minor girl
Author
Hyderabad, First Published Jun 27, 2020, 10:47 AM IST

కాపాడిన పోలీసులో కాటు వేశారు. మైనర్ బాలిక అనే కనికరం కూడా లేకుండా దారుణంగా ప్రవర్తించారు. పోలీసులంతా కలిసి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరి కారణంగా బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. ఈ విషాదకర సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జాతర చూసేందుకు గడిచిన మార్చి 25వ తేదీన బాలిక బీరమిత్రపూర్‌ విచ్చేసింది. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రవాణా సౌకర్యాలు లేక  ఇంటికి చేరుకోలేక చిక్కుకుంది. స్థానిక బస్టాండ్‌లో ఒంటరిగా తిరుగుతున్న తరుణంలో పహారా కాస్తున్న పోలీసుల కన్ను ఆ బాలికపై పడింది. రక్షణ కల్పిస్తామని నమ్మబలికి బాలికను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

 స్టేషన్‌ పై అంతస్తులో బాలికకు విడిది ఏర్పాటు చేశారు. స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జి ఆనంద చంద్ర మఝి తొలి రోజున బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మర్నాడు బాలికను ఆమె ఇంటికి చేర్చారు. 3 నెలల పాటు క్రమం తప్పకుండా స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించారు. వచ్చిన ప్రతిసారి పై అంతస్తులో విడిది కల్పించి స్టేషన్‌లో సిబ్బంది వంతుల వారీగా బాలిక పట్ల లైంగికదాడికి పాల్పడ్డారు.  

కాగా.. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురవ్వగా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది. దీంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాలికకు విష ప్రయోగం చేసి మరీ గర్భస్రావం చేయించారు.

ఇంటికి చేరిన మర్నాడు బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో రౌర్కెలా ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం కుటుంబసభ్యులు, బంధువులు తరలించారు. ఆరోగ్య పరీక్షల సందర్భంగా అక్కడి వైద్యులు నిలదీయడంతో అబార్షన్ విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో బాధిత బాలిక బంధువులు శిశు సంక్షేమ సంస్థ (చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌) సహాయం కోసం అభ్యర్థించారు. దీంతో జిల్లా శిశు సంరక్షణ అధికారి రాయిబాగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో బీరమిత్రపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జి ఆనంద చంద్ర మఝి, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ దొలొమొణి నాయక్, ఇద్దరు యువకులు, బాధిత   బాలిక పెంపుడు తండ్రిని నిందితులుగా పేర్కొన్నారు. బాలికకు గర్భస్రావం చేసిన బీరమిత్రపూర్‌ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం  వైద్యుడిని కూడా ఫిర్యాదులో నిందితుడిగా పేర్కొన్నారు. అయితే వైద్యుడు పరారీలో ఉన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios