భువనేశ్వర్: సెల్ఫీ సరదా  14 ఏళ్ల యువకుడి ప్రాణాలు తీసింది.  ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి  రైల్వే స్టేషన్ లో  ఈ ఘటన చోటు చేసుకొంది.

ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్ లో రైలు పై భాగంలో నిలబడి సెల్ఫీ దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

14 ఏళ్ల యువకుడు  రైలు బోగీపై నిలబడి సెల్ఫీ దిగుతున్న సమయంలో  హైటెన్షన్ వైర్ తగిలి రెండు రైల్వే బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడు  మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.

ఈ సమయంలో  రెండు బోగీలు దగ్ధమైన ఘటనలో  రైల్వే ట్రాక్ వద్ద ఉన్న మృతుడి ఇద్దరు మిత్రులు  కూడ స్వల్పంగా గాయపడ్డారు.

ఈ విషయమై దర్యాప్తు చేసేందుకు డివిజన్ రైల్వే మేనేజర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కరోనా స్పెషల్ ట్రైన్ గత కొన్ని రోజులుగా గజపతి జిల్లాలోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్లో నిలిచింది.