దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం శాతం రోజు రోజుకీ పెరిగిపోతోంది. దానిని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానం అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రూల్ ప్రకారం.... ఈ రోజు సరి తేదీ అయితే... ఆ రోజు రోడ్డు కేవలం సరి నెంబర్ ఉన్న కార్లు మాత్రమే రోడ్డు పైకి అడుగుపెట్టాలి. బేసి తేదీ అయితే.. బేసి నెంబర్ ఉన్న కారు మాత్రమే తిరగడానికి అనుమతి ఇస్తున్నారు.దీని కారణంగా కస్త అయినా కాలుష్యం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కనీసం రోజూ సగానికి సగం వాహనాలు తిరగకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి కాస్త కాలుష్యం తగ్గుతుంది.

ఈ రూల్ ని పాటించని వారికి భారీ జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే.... కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే కాకుండా... సెలబ్రెటీలకు కూడా ఈ నియమం వర్తిస్తుందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎంపీకి ఈ రూల్ పాటించని కారణం చేత జరిమానా విధించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే....బీజేపీ నేత విజ‌య్ గోయ‌ల్‌.. బేసి సంఖ్య క‌లిగి ఉన్న కారుతో రోడ్డుపైకి వ‌చ్చారు. ఆప్ స‌ర్కార్ విధానాన్ని త‌ప్పుప‌డుతూ.. దానికి నిర‌స‌న‌గా ఆయ‌న బేసి సంఖ్య రిజిస్ట్రేష‌న్ ఉన్న కారుతో వీధుల్లోకి వ‌చ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల‌కు ఆ నేత‌కు చ‌లానా రాశారు. రూల్స్ ఉల్లంఘించినందుకు ఫైన్ వేశారు. 

కేజ్రీ స‌ర్కార్ స‌రి-బేసి నియ‌మంతో డ్రామా ఆడుతోంద‌ని గోయ‌ల్ విమ‌ర్శించారు. ఆ రూల్‌తో కాలుష్యం ఏమాత్రం త‌గ్గ‌ద‌న్నారు. అయితే సీఎం కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తి రోజు 30 ల‌క్ష‌ల కార్లు ఢిల్లీ రోడ్ల‌పై తిరుగుతున్నాయ‌న్నారు. సరి-బేసి రూల్ వ‌ల్ల రోజు 15 ల‌క్ష‌ల కార్లు రోడ్డుపైకి రావ‌ని, దీని వ‌ల్ల క‌చ్చితంగా కాలుష్యం త‌గ్గుతుంద‌ని కేజ్రీ చెప్పారు. ప్ర‌జ‌లు స‌హ‌క‌రిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు.