సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. అయితే అభియోగాల నమోదుపై వాదనలకు బీవీ శ్రీనివాసరెడ్డి, లాయర్లు హాజరు కాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఓఎంసీ తరపున వాదనలు లేనట్లుగా పరిగణిస్తామని హెచ్చరించింది.

తదుపరి విచారణలో ఖచ్చితంగా వాదించాలని గత నెల 29నే షరతు విధించిన విషయాన్ని సీబీఐ కోర్టు ప్రస్తావించింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.