Asianet News TeluguAsianet News Telugu

యూపీలో రాంలీలా వేదికపై అశ్లీల నృత్యాలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

యూపీలోని రామ్ లీల వేధికపై మహిళలు అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. బహ్జోయ్ ప్రాంతంలో రికార్డు చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Obscene dances on Ramlila stage in UP.. Police registered a case
Author
First Published Oct 5, 2022, 12:28 PM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్జోయ్ ప్రాంతంలోని రామ్ లీలా (నాటకం) సందర్భంగా వేదికపై అశ్లీల నృత్యం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి రాంలీలా వేదికపై అశ్లీల నృత్యం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. ఈ కేసులో రామ్‌లీలా కమిటీకి చెందిన 10 మంది సభ్యులు, బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పన్వాసాకు చెందిన డ్యాన్సర్లపై కేసు నమోదు చేశారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని నిర్వాహ‌కుల‌ను హెచ్చ‌రించారు.

అస్సాంలో దారుణం.. మైన‌ర్ బాలిక‌పై గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్ట్..

ఈ వీడియోలో.. రావణుడు (పాత్ర‌) వేదికపై కూర్చొని ఉన్నారు. ఆయ‌న ముందు ఇద్ద‌రు మ‌హిళ‌లు సినిమాల్లోని ఐటెం సాంగ్ కు అస‌భ్య‌క‌ర‌మైన రీతిలో డ్యాన్స్ చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో రావ‌ణుడిని ఆకర్శించేందుకు ఆ డ్యాన్స‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఆమె డ్యాన్ చేసేట‌ప్పుడు ప్ర‌జ‌లు గ‌ట్టిగా అరుస్తు ఎంక‌రేజ్ చేస్తున్నారు.

కాగా..  రాంలీలా సందర్భంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అనేక నగరాల్లో ఇలాంటి అశ్లీల నృత్యాలు సర్వసాధారణంగా జ‌రుగుతుంటాయి. ఇదే రాష్ట్రం నుంచి ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ప‌లు వీడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. హాపూర్ నుంచి వెలుగులోకి వ‌చ్చిన ఓ వీడియోలో వేదికపై కూర్చున్న రావణుడిని ఆకర్షించడానికి ఇద్దరు ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ప్రయత్నిస్తున్నారు. మ‌రో వీడియోలో రాముడు, సీత వేదికపై కూర్చుని ఉన్నారు. అక్క‌డ ఓ మ‌హిళ అశ్లీల నృత్యం చేస్తూ ఓ వృద్దుడిని వేదిక‌పైకి లాగుతోంది.

కాన్పూర్‌లో కూడా ఇలాంటి దృశ్యాలు క‌నిపించాయి. హనుమంత్ బీహార్ చౌకీలో కూడా ఇలాంటి వీడియోనే ఒకటి వైర‌ల్ అయ్యింది. అయితే అందులో పోలీసులు కూడా క‌నిపిస్తున్నారు. ఈ డ్యాన్స్ ను వారు చూసిన‌ప్ప‌టికీ మౌనంగానే ఉండిపోయారు. అలాగే కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలోని అక్బర్‌పూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన రామ్‌లీలాలో కూడా ఇలాంటి అశ్లీల నృత్యాలు చేశారు. ఈ వీడియో కూడా వైర‌ల్ అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios