Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీపై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు.. కేసు న‌మోదు

Nagpur: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఆయ‌న‌ను ఉద్దేశించి పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిపై నితిన్ గడ్కరీ కార్యాలయం ఫిర్యాదు చేసింద‌నీ, ఈ క్ర‌మంలోనే కేసు న‌మోదుచేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు.
 

Objectionable posts against Union Minister Nitin Gadkari; Nagpur police registered a case
Author
First Published Mar 21, 2023, 10:07 AM IST

Union minister Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఆయ‌న‌ను ఉద్దేశించి పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిపై నితిన్ గడ్కరీ కార్యాలయం ఫిర్యాదు చేసింద‌నీ, ఈ క్ర‌మంలోనే కేసు న‌మోదుచేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే..  కేంద్ర‌ మంత్రి నితిన్ గడ్కరీని ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై తమ సైబర్ సెల్ కేసు నమోదు చేసినట్లు నాగ్‌పూర్ పోలీసులు సోమవారం తెలిపారు. వాట్సప్ లో సర్క్యులేట్ అయిన పోస్టుల్లో నిందితుడు దత్తాత్రేయ జోషి.. గడ్కరీని ఉద్దేశించి కొన్ని అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశాడని పోలీసులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న గడ్కరీ కార్యాలయం ట్విట్టర్ ద్వారా కేసు నమోదు చేయాలని సైబర్ పోలీసులను కోరింది. ఈ పోస్టులను వైరల్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగ్‌పూర్ లోని బీజేపీ సీనియర్ నేత కార్యాలయ ప్రతినిధి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

గడ్కరీ కార్యాలయం వర్గాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. "కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వ్యతిరేకంగా అభ్యంతరకర, జాత్యహంకార పోస్ట్ మహారాష్ట్రలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. దత్తాత్రేయ జోషి అనే వ్యక్తి చేసిన ఫేక్ న్యూస్ ఇది. ఇదే విషయం గురించి నాగ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇలాంటి తప్పుడు పోస్టులు రాసే వారిపై, ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు" తెలిపారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios