పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రాత్ జహాన్ కు సోషల్ మీడియాలో చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ ఆమె భారత హై కమిషన్ కు లేఖ రాశారు.
పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రాత్ జహాన్ కు సోషల్ మీడియాలో చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ ఆమె భారత హై కమిషన్ కు లేఖ రాశారు.
బెంగాలీ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం నుస్రాత్ లండన్‌లో ఉన్నారు. గత నెలలో దుర్గా అమ్మవారి రూపంతో మహిషాసురమర్థినిలా త్రిశూలం పట్టుకొని డ్యాన్స్ చేసిన ఓ వీడియోను పోస్ట్ చేశాకే బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు.
ఎంపీగా మామూలుగా ఆమెకున్న భద్రతతో పాటు.. బెదిరింపుల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, విదేశాంగ శాఖల ద్వారా అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత హైకమిషన్ కు రాసిన లేఖలో తనకువచ్చిన బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సుస్రాత్ జత చేసినట్టు తెలిపారు.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గా పూజ ఉత్సవాల ప్రధాన్యతను తెలిపే థీమ్ సాంగ్ ఆషే మా దుర్గా హే పాటకు నృత్యం చేసిన వీడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసింది.ఈ సాంగ్ ను టీఎంటీ బార్ కంపెనీ విడుదల చేసింది.
టీఎంటీ బార్ కంపెనీ రిలీజ్ చేసిన ఈ సాంగ్‌లో ఇద్దరు ఎంపీలు దుర్గా మాతను పూజిస్తూ డాన్స్ చేశారు. యువ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తిలతోపాటు మరో ప్రసిద్ధ బెంగాలీ నటి శుభశ్రీ గంగూలి కూడా ఆడిపాడారు.
ఆషే మా దుర్గా షే టైటిల్‌తో ఉన్న ఈ పాటకు ఇంద్రదీప్ దాస్ గుప్తా సంగీతం అందించగా బాబా యాదవ్ కొరియోగ్రాఫ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట ఇంటర్నెట్‌లో దుమ్ము రేపుతోంది. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ పాట ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ సైతం సంపాదించింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎంపికయ్యారు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు రాజకీయాల్లో ఇలా అడుగుపెట్టారో లేదో అలా వివాదాలతోనే నెట్టుకొస్తున్నారు.
అతి చిన్న వయసులోనే పార్లమెంటుకు ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన వీరు ప్రతి నిత్యం ఏదో ఓ వార్తతో హల్ చల్ చేస్తున్నారు. ఇకపోతే ఇద్దరు ఎంపీలలో నుస్రత్ జహాన్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు.
ఎంపీగా గెలిచిన తర్వాత నుస్రత్ జహాన్ లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమె హిందూ సంప్రదాయ పద్ధతిలో నుదట సింధూరం, చీర ధరించి హాజరై విమర్శల పాలయ్యారు.
ఎన్ని విమర్శలు ఎదురైనా నుస్రత్ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతారు. తాజాగా ఈ యువ ఎంపీలు మరోసారి వార్తాల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెంగాల్ ప్రజలు దుర్గా పూజ కోసం సిద్ధమవుతున్నారు. మెుత్తానికి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది.
