తమిళనాడులో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన చెన్నై శివార్లలోని తిరువెర్కాడు సమీపంలోని Shenbaga నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో చోటుచేసకుంది. 

తమిళనాడులో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన చెన్నై శివార్లలోని తిరువెర్కాడు సమీపంలోని Shenbaga నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో చోటుచేసకుంది. వివరాలు.. ఈరోడ్‌కు చెందిన 19 ఏళ్ల సుమతి షెన్‌బాగా నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతుంది. అయితే ఆమె హాస్టల్‌లో అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సుమతి హాస్టల్‌లోని తన గదిలోకి వెళ్లింది. కొంత సమయం తర్వాత క్లాసుకు వస్తానని స్నేహితులకు చెప్పింది. ఎంతసేపటికి సుమతి క్లాస్‌కు రాకపోవడంతో ఆమె స్నేహితులు హాస్టల్‌కు వెళ్లి చూడగా డోర్‌ లోపలి నుంచి గడియ వేసి ఉంది. 

ఎంతసేపటికీ సుమతి తలుపు తీయకపోవడంతో.. అనుమానంతో హాస్టల్ సిబ్బంది గది తలపులు బద్దలు కొట్టారు. గదిలో సుమతి మృతిచెంది కనిపించింది. దీంతో కాలేజ్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. సుమతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇక, సుమతి మృతిపై ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అలాగే హాస్టల్‌లోని తోటి విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. విద్యార్థి మృతితో కాలేజ్ క్యాంపస్‌లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత కోసం ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సిబ్బందిని నియమించారు. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్‌ను వదిలిపెట్టలేదని ప్రాథమిక విచారణలో తేలింది. unnatural death కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.