Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ లో దారుణం.. కదులుతున్న ఆటోలో నర్సుపై సామూహిక అత్యాచారం..

కదులుతున్న ఆటోలో ఓ నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పంజాబ్ లో కలకలం రేపింది. ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Nurse raped in moving auto rickshaw in rajasthan
Author
First Published Dec 15, 2022, 9:04 AM IST

పంజాబ్‌ : పంజాబ్‌లోని మొహాలీలో నిర్భయ తరహా ఘటన భయాందోళనలు కలిగించింది. కదులుతున్న ఆటోరిక్షాలో ఓ నర్సుపై ఇద్దరు నిందితులు అత్యాచారం చేశారు. వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. నేరం జరిగిన 12 గంటల్లోనే కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, ఆటోరిక్షాను కూడా స్వాధీనం చేసుకున్నామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) సందీప్ గార్గ్ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఎస్‌పి మాట్లాడుతూ, "ఆటోరిక్షాలో ఆమె ఎక్కినప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒకరు డ్రైవర్, మరొకరు డ్రైవర్ స్నేహితుడు. ఆ నర్సు రాత్రి 10 గంటలకు ఖరార్ నుండి తన ఇంటికి వెళ్లడానికి ఆటోరిక్షాను ఎక్కింది. వారు కురాలి వైపు హైవేలో వెడుతున్నప్పుడు, కదులుతున్న ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె తనను తాను రక్షించుకునేందుకు తీవ్రంగా, ధైర్యంగా పోరాడింది. కానీ వారి పశుబలం ముందు ఓడిపోయింది. ఆ తరువాత ఈ దారుణ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. 

నాలుగు నెలలుగా సవతి కూతురిమీద తండ్రి అత్యాచారం..అరెస్ట్...

ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్టు చేసాం. వారికి ఇదివరకు నేర చరిత్ర ఉందా? అనే కోణంలో పరిశీలిస్తున్నాం. వారిని రిమాండ్‌కు పంపించాం..అని తెలిపారు.ఓ మహిళపై ఆటోరిక్షా డ్రైవర్ అత్యాచారం చేయడం మొహాలీలో ఇదే తొలి కేసు అని ఎస్‌ఎస్పీ తెలిపారు.నిందితులను రేడియాల గ్రామానికి చెందిన మల్కీత్ సింగ్ (24) అలియాస్ బంటీ, సింగ్‌పురా కురాలి గ్రామానికి చెందిన మన్మోహన్ సింగ్ (29) అలియాస్ మణిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై మంగళవారం, బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఖరార్-కురాలి హైవేపై రాయత్ బహరా హాస్పిటల్ సమీపంలో నర్సు ఆటోలో నుంచి దూకింది. అలా వారినుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ఎస్పీ అమన్‌దీప్ సింగ్ బ్రార్, ఎస్పీ నవరీత్ సింగ్ విర్క్, డీఎస్పీ రూపిందర్‌దీప్ కౌర్ సోహి, డీఎస్పీ గుర్షేర్ సింగ్, సీఐఏ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఎస్‌ఐ భగత్వీర్ సింగ్ ఎస్‌హెచ్‌వో సదర్ ఖరార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామని ఎస్‌ఎస్పీ గాగ్ తెలిపారు. వీరిమీద ఐపీసీ 376, 354-ఎ, 354-బి, 342, 324, 323, 511, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాజస్థాన్ లో అత్యాచారాల కేసుల వివరాలు.. 

జనవరి 2022 - చండీగఢ్‌లోని సెక్టార్ 17లో జనరల్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో 35 ఏళ్ల కోల్‌కతా మహిళపై ఆటోరిక్షా డ్రైవర్ అత్యాచారం చేశాడు. ముగ్గురు హోంగార్డు వాలంటీర్లు ఆమెను రక్షించారు.

మే 2022 - చనిద్‌ఘర్‌లోని సెక్టార్ 50 అటవీ ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై 31 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు.

ఏప్రిల్ 2019 - మొహాలీలో 22 ఏళ్ల వివాహిత క్యాబ్‌లో అత్యాచారానికి గురైంది. ఆమె వర్క్ ప్లేస్ దగ్గర అడ్రస్ అడగడంతో క్యాబ్ డ్రైవర్ ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. ఆమె కారు ఎక్కిన తరువాత బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆగస్ట్ 2018- డెహ్రాడూన్‌కు చెందిన 21 ఏళ్ల మహిళ, స్టెనోగ్రఫీ తరగతులకు హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన ఆమెపై సెక్టార్ 53లోని అటవీ ప్రాంతంలో ఆటో డ్రైవర్, అతని ఇద్దరు సహాయకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితుల గుర్తింపును కాపాడేందుకు వివరాలు వెల్లడించలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios