జాతీయ  గణాంక సంఘం  తాత్కాలిక చైర్‌పర్సన్‌ మోహనన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఆయన  పీటీఐతో మాట్లాడుతూ...ఎన్‌ఎస్‌సీ నుంచి తాను తప్పుకోనున్నట్లు  ప్రకటించారు. కమిషన్ బాధ్యతలను తాము నెరవేర్చలేకుండా ఉన్నామని...ఈ ఒత్తిడిని తట్టుకోలేకే చైర్‌పర్సన్‌ భాద్యతల నుండి తప్పుకుంటున్నట్లు మోహనన్ పేర్కొన్నారు.

అయితే జాతీయ గణాంక సంఘం (ఎన్‌ఎస్‌సీ) సభ్యులు అసంతృప్తిగా లేరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల పలువురు సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా సర్కార్ పైవిధంగా పేర్కొంది. కొద్ది నెలలుగా జరిగిన కమిషన్ సమావేశాల్లో వారు ఏ అంశంపైనా ఆందోళన వ్యక్తం చేయలేదని తెలియజేసింది. 

 ఎన్‌ఎస్‌సీ స్వతంత్ర సభ్యులుగా కొనసాగుతున్న పీసీ మోహనన్, జేవీ మీనాక్షి ఈమధ్యే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జీడీపీ గణాంకాల సిరీస్ మార్పు, లేబర్ ఫోర్స్ సర్వే
విడుదలలో జాప్యంపై ప్రభుత్వంతో విభేదించే వీరు తప్పుకున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో గణాంక, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ ఇలా వివరణ ఇచ్చింది. ఎన్‌ఎస్‌సీ సలహాలు, సూచనలను గౌరవిస్తామని కూడా స్పష్టం చేసింది.