న్యూఢిల్లీ: ఇండియా, చైనా సరిహద్దుల మధ్య చోటు చేసుకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితిని జాతీయ భద్రతా సలహదారు అజిత్ ధోవల్ మంగళవారం నాడు  సమీక్షించారు.రెండు దేశాల సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.

రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్ నది సమీపంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.దీంతో అజిత్ ధోవల్ పరిస్థితిని సమీక్షించారు.

రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కమాండర్ స్థాయి అధికారులు  మరోసారి చర్చించనున్నారు.చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి. 

ఆగష్టు 29, 30 తేదీల్లో చైనాకు చెందిన ప్రజా గెరిల్లా సైన్యం నిబంధనలను ఉల్లంఘించినట్టుగా  ఇండియా ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అజిత్ ధోవల్ పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో కూడ ఇదే తరహాలో రెండు దేశాల మధ్య ఇదే తరహాలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.