కర్ణాటకలో అసభ్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో నిద్రిస్తున్న మహిళాపై మద్యం మత్తులో ఉన్న యువకుడు మూత్రం పోశాడు. తీవ్రకలకలం రేపుతోన్న ఈ ఘటన విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది.  

కర్ణాటకలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్రం పోసిన ఘటనను మరువక ముందే.. తాజాగా అదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఈ అసభ్యకర ఘటన కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో వెలుగులోకి వచ్చింది. బస్సులో నిద్రిస్తున్న మహిళాపై మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు మూత్రం పోశాడు. 

వివరాల్లోకెళ్తే..బుధవారం (ఫిబ్రవరి 22) రాత్రి విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులో ఒక దాబా వద్ద మంగళవారం అర్ధరాత్రి సమయంలో బస్సు ఆగింది. బస్సులోని ప్రయాణీకులు కొందరూ టీ, టిఫిన్స్ చేయడానికి వెళ్తే.. మరికొందరూ వాష్ రూమ్స్ కు వెళ్లారు. ఆ సమయంలో 
మద్యం మత్తులో ఉన్న రామప్ప అనే ప్రయాణీకుడు తన ముందు సీట్లో పడుకున్న ప్రయాణీకురాలి వద్దకు వచ్చి.. ఆమెపై మూత్ర విసర్జన చేశాడు.ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమై.. కేకులు పెట్టింది. దీంతో మిగిలిన ప్రయాణికులు అక్కడికి వచ్చి.. నిందితుడిని పట్టుకుని దేహాశుద్ది చేసి.. బస్సులో నుంచి దించారు. కండక్టర్ , డ్రైవర్ మురికిగా ఉన్న సీటును శుభ్రం చేసి, వారు మహిళకు మరో సీటు కూడా ఇచ్చారు. 

మద్యం మత్తులో ఉన్న నిందితుడు మహిళపై మూత్ర విసర్జన చేయలేదని, ఘటనపై కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ క్షమాపణలు చెప్పింది. తన సీటుపై మూత్ర విసర్జన చేసిన తాగుబోతు ప్రయాణికుడిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేర్కొంది. ఈ కారణంగానే బస్సు తన నిర్ణీత ప్రయాణాన్ని కొనసాగించింది. అయితే, ఈ ఘటనపై ఆర్​టీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్​టీసీ అధికారులు భావిస్తున్నారట.

ఈ ఏడాది ప్రారంభంలో అలాంటి ఉదంతం ఒకటి ఎయిరిండియా విమానంలో తెరపైకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనలో నిందితులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. కాగా గతేడాది నవంబర్‌లో కూడా ఇదే తరహా ఘటనలో నిందితులపై కేసు నమోదైంది. నిందితుడు శంకర్ మిశ్రాపై చర్యలు తీసుకున్నారు. నవంబర్‌లో న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో శంకర్‌ మిశ్రా అనే ప్రయాణికుడు వృద్ధురాలికి మూత్ర విసర్జన చేశాడు. నిందితుడు శంకర్ మిశ్రాపై ఎయిర్‌లైన్స్ నాలుగు నెలల పాటు నిషేధం విధించింది. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేశారు కూడా.