డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు విధించబోమని, ఇప్పట్లో ఆ ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశ ప్రజలందరూ డిజిటల్ చెల్లింపులను స్వేచ్ఛగా ఉపయోగించగలగాలని తెలిపారు.
డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలను వసూలు చేసేందుకు ఇది సరైన సమయం కాదని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నాను. ‘‘ మేము డిజిటల్ చెల్లింపును ప్రజా ప్రయోజనంగా చూస్తున్నాం. ప్రజలు దానిని స్వేచ్ఛగా యాక్సెస్ చేయగలగాలి. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ ఆకర్షణీయంగా మారుతుంది. అలాగే డిజిటలైజేషన్ ద్వారా మనం ఒక స్థాయి పారదర్శకతను సాధిస్తాము.’’ అని ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
దేశం కోసం ఖాదీ.. కానీ, త్రివర్ణ పతాకం కోసం చైనీస్ పాలిస్టరా?
‘‘ అందువల్ల పేమెంట్స్ పై ఛార్జ్ చేయడానికి ఇది సరైన సమయం కాదని మేము భావిస్తున్నాం. మనం ఓపెన్ డిజిటల్ లావాదేవీలు, డిజిటలైజేషన్, గ్రేట్ యాక్సెస్ ను ప్రారంభించగల ప్లాట్‌ఫారమ్‌ల వైపు మరింతగా ముందుకు సాగుతున్నాం.” అని మంత్రి జోడించారు.
వాస్తవానికి, UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా చేసే డబ్బు లావాదేవీలపై రుసుము విధించాలని, డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన ఇతర సమస్యలపై ప్రజల అభిప్రాయాన్ని కోరాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఛార్జీలపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది.
చైనా బెదిరింపులకు భయపడం.. ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు: అరుణాచల్ సరిహద్దు గ్రామ ప్రజలు
డిసెంబర్ 08, 2021 నాటి డెవలప్‌మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్‌మెంట్‌లో ప్రకటించినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజల అభిప్రాయం కోసం ఈ నెల ఆగస్టు 17వ తేదీన‘‘ చెల్లింపు వ్యవస్థలలో ఛార్జీలు’’ అనే అంశంపై చర్చా పత్రాన్ని విడుదల చేసింది.
అవసరమైతే సోనాలి ఫోగట్ మృతి కేసును సీబీఐకి అప్పగిస్తాం - గోవా సీఎం ప్రమోద్ సావంత్
భారతదేశంలో RTGS, NEFT చెల్లింపు వ్యవస్థలు RBI యాజమాన్యంలో ఉంటాయి. IMPS, RuPay, UPI మొదలైన సిస్టమ్‌లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యాజమాన్యంలో ఉంటూ నిర్వహించబడుతున్నాయి. వీటిని బ్యాంకులే ప్రమోట్ చేశాయి. ఇది లాభాపేక్షలేని సంస్థ. కాగా.. భారత్ లో నోట్ల రద్దు చేసిన తరువాత అంటే 2016 జూలై నుంచి ఈ డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన డేటా ప్రకారం UPI 6.28 బిలియన్ల లావాదేవీలను రూ. 10.62 ట్రిలియన్లుగా నివేదించింది.
