కోల్ కతాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ షర్బరీ దత్తా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కోల్ కతాలోని ఆమె నివాసంలోని బాత్రూమ్ లో అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనార్హం. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. షర్బరీ దత్తా వయసు 63 సంవత్సరాలు కాగా.. ఆమె ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్.

మరీ ముఖ్యంగా పురుషుల దుస్తులు ఆమె డిజైన్ చేస్తారు. కాగా..  ఆమె ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ కి కూడా దుస్తులు డిజైన్ చేశారు.

రవీంద్రనాథ్ అనంతర కాలంలో సాహిత్య ఆవిష్కరణలకు పేరుగాంచిన ప్రముఖ బెంగాలీ కవి అజిత్ దత్తా కుమార్తె  ఈ షర్బరి దత్తా. ఆమె ప్రెసిడెన్సీ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ చేసింది మరియు కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది. కాగా..  షర్బరీ  మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.