Asianet News TeluguAsianet News Telugu

"రాజనీతి కాదు ధర్మనీతి" : ప్రతిపక్షాల విమర్శలకు రామమందిరం ప్రధాన పూజారి ఏమన్నారంటే...

జనవరి 22న అయోధ్యలోని మహా మందిరంలో శ్రీరాముని విగ్రహం "ప్రాణ్ ప్రతిష్ఠ" జరగనుంది. దీనిమీద రామాలయ ప్రధాన పూజారి మాట్లాడారు.
 

Not Rajneeti But Dharmaneeti : chief priest of Ram Mandir explains the opposition's criticism - bsb
Author
First Published Jan 17, 2024, 2:28 PM IST

అయోధ్య : అయోధ్యలోని రామ మందిరంలో 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమం పేరుతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్రం 'రాజకీయం' ఆడుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మంగళవారం మాట్లాడుతూ... అది 'రాజనీతి' (రాజకీయం) కాదని, అది 'ధర్మనీతి' (ధర్మ మార్గం) అన్నారు.

‘ప్రధాని గురించి చులకనగా మాట్లాడుతున్నారు.. దానికి బీజేపీ సమాధానం చెబుతుంది. అయినా.. నేను 'ధర్మనీతి'కి చెందిన వాడిని.. నేను చేయాల్సిందల్లా 'రామభక్తులకు' సేవ చేయడమే. నేను పూజారిని, నాకు రాజకీయాలతో సంబంధం లేదు' అని ఆచార్య సత్యేంద్ర దాస్ ఏఎన్ఐతో మాట్లాడుతూ అన్నారు.

జనవరి 22న శ్రీరామ్‌లల్లాకు 'ప్రాణ్‌ ప్రతిష్ఠ' కార్యక్రమం జరగనుంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విపక్షాలు బీజేపీని ప్రశ్నిస్తున్నాయి. అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22న నిర్వహించే కార్యక్రమాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ పూర్తిగా రాజకీయ నరేంద్రమోదీ కార్యక్రమంగా మార్చాయని, భారత ప్రధాని చుట్టూ, ఆర్ఎస్ఎస్ చుట్టూ రూపొందించిన రాజకీయ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నేతలు వెళ్లడం కష్టమని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ మంగళవారం అన్నారు. 

Ayodhya Ram Mandir : అయోధ్యకు చేరుకున్న సీతారామలక్ష్మణులు.. ప్రాణప్రతిష్ట ఏర్పాట్లు చూసి భావోద్వేగం...

ఈ మెగా వేడుకకు ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది, దీనిని "బిజెపి/ఆర్ఎస్ఎస్" కార్యక్రమంగా పేర్కొంది. ప్రధాన వేడుకలకు వారం రోజుల ముందు మంగళవారం వైదిక ఆచారాలు ప్రారంభం అయ్యాయి. దీనిమీద ఆచార్య దాస్ మాట్లాడుతూ.. "ఆచారాలు ప్రారంభమయ్యాయి. అన్ని విధానాలను ఆచార్యులు నిర్వహిస్తారు, తరువాత జనవరి 22న, అయోధ్యలోని కొత్తగా నిర్మించిన ఆలయం వద్ద రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది"

"రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత, 'పూజ'నిర్వహించిస్తారు. విగ్రహానికి స్నానం చేయిస్తారు. తరువాత, రామ్ లల్లాను 'కిరీటం', 'కుండలాలు'తో అలంకరిస్తారు, తరువాత 'హారతి' ఇస్తారు" అని చెప్పుకొచ్చారు. 

జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ప్రధాన క్రతువులను నిర్వహిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios