ఆవుపేడ చోరీ చేశాడనే కారణంతో ఓ ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బీరూర్ జిల్లాలో ఇటీవల పశు సంరక్షణ విభాగానికి చెందిన ఆవుపేడ చోరీకి గురైంది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.

పశుసంరక్షణ విభాగం డైరెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పశుసంరక్షణ విభాగం సూపర్ వైజర్ దొంగిలించనట్లుతేలింది. అమృత మహల్ కవల్ స్టాక్ లో నిల్వ ఉంచిన 35నుంచి 40 ట్రాక్టర్ల ఆవుపేడను సూపర్ వైజర్ చోరీ చేశాడు. ఆ పేడ విలువ సుమారు రూ.1.25లక్షల విలువ ఉంటుందని వారు చెప్పారు.

సదరు ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఆవుపేడను ఆయుర్వేదం, వ్యవసాయానికి వినియోగిస్తారన్న విషయం తెలిసిందే.