Asianet News TeluguAsianet News Telugu

అబ్బాయినే కానీ.. అమ్మాయిలా ఉన్నాను.. అందుకే..

తాను పుట్టడానికి అబ్బాయిగా పుట్టినా.. తన మాట, నడక తీరు అమ్మాయిలా ఉన్నాయనే ఆవేదనతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Not my fault I was born gay: 19-year-old commits suicide over homophobia
Author
Hyderabad, First Published Jul 10, 2019, 10:36 AM IST

తాను పుట్టడానికి అబ్బాయిగా పుట్టినా.. తన మాట, నడక తీరు అమ్మాయిలా ఉన్నాయనే ఆవేదనతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తాను ఓ గేనంటూ.. కుటుంబసభ్యులు, సమాజం దూరంగా పెట్టిందని... అది తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ యువకుడు సోషల్ మీడియాలో పెట్టడం విశేషం. ఆ తర్వాత సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబైకి చెందిన అవిన్షు పటేల్‌ చెన్నైలోని ఓ స్పాలో పనిచేస్తున్నాడు.  అతను గే అని గుర్తించిన కుటుంబసభ్యులు దూరం పెట్టేశారు. దీంతో.. ముంబయి వదిలి చెన్నై చేరుకున్నాడు.  అయితే పనిచేసే చోట కూడా అతడికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలో చెన్నైలోని ఇంజమ్‌బాక్కం బీచ్‌ వద్ద సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కాగా చనిపోయేముందు అవిన్షు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు చర్చనీయాంశమయ్యాయి. ‘ నేను ఒక అబ్బాయిని. కానీ నా నడక, మాట, ప్రవర్తన అన్నీ అమ్మాయిలాగానే ఉంటాయి. భారతదేశంలో ఉన్న కొంతమంది ప్రజలకు ఇలాంటివి నచ్చవు కదా. అందుకే గే, ట్రాన్స్‌జెండర్లను గౌరవించే దేశాలను చూస్తే గర్వంగా ఉంటుంది. అదే విధంగా ఇండియాలో నాలాంటి వాళ్లను మనుషులుగా చూసేవాళ్లను కూడా. అయినా నేనిలా ఉండటం నా దోషం కాదు. ఇది దేవుడు చేసిన తప్పు. అందుకే నన్ను నేనే ద్వేషిస్తున్నా’ అంటూ అవిన్షు ఫేస్‌బుక్‌లో భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios