Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ లాంటి కాదు, నిజమైందే: వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకు యూపీ పోలీసులు

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ నకిలీది కాదని యూపీ పోలీసులు శుక్రవారం నాడు సుప్రీంకోర్టుకు తెలిపారు.దూబే విషయంలో చట్టం ప్రకారంగానే తాము వ్యవహరించామని పోలీసులు స్పష్టం చేశారు.

Not Like Telangana: UP Police To Supreme Court On Vikas Dubey Encounter
Author
New Delhi, First Published Jul 17, 2020, 4:43 PM IST


న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ నకిలీది కాదని యూపీ పోలీసులు శుక్రవారం నాడు సుప్రీంకోర్టుకు తెలిపారు.దూబే విషయంలో చట్టం ప్రకారంగానే తాము వ్యవహరించామని పోలీసులు స్పష్టం చేశారు.

వికాస్ దూబే ఎన్ కౌంటర్ విషయంలో శుక్రవారం నాడు  యూపీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నుండి యూపీ రాష్ట్రంలోని కాన్పూరుకు తరలిస్తుండగా వికాస్ దూబే ఈ నెల 10వ తేదీన ఎన్ కౌంటర్ లో మరణించాడు.

పోలీసుల నుండి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే మరణించాడని పోలీసులు తెలిపారు.వికాస్ దూబే హత్య నకిలీ ఎన్ కౌంటర్ లో జరిగింది కాదని యూపీ తేల్చారు. తెలంగాణ ఎన్ కౌంటర్ తో ఈ కేసును పోల్చలేమని యూపీ పోలీసులు స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం జ్యడిషియల్ కమిషన్ ను ఆదేశించలేదు. కానీ తాము జ్యూడీసీయల్ కమిషన్ కు ఆదేశించినట్టుగా యూపీ పోలీస్ డైరెక్టర్ జనరల్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా పోలీసులు వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. సమయం ఇస్తే మరిన్ని విషయాలను వివరించనున్నట్టుగా ఆయన ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు.వికాస్ దూబే ఎన్‌కౌంటర్ పై  రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆథ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటైంది.

వికాస్ దూబే ఎన్ కౌంటర్ తెలంగాణ ఎన్ కౌంటర్ తో పోలిస్తే చాలా భిన్నమైందన్నారు. వికాస్ దూబే 64 కేసుల్లో నిందితుడని పోలీసులు అఫిడవిట్ లో ప్రస్తావించారు.వెటర్నరీ డాక్టర్ దిశ ను రేప్ చేసి హత్య చేశారు నలుగురు నిందితులు. ఈ నిందితులను గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన షాద్ నగర్ కు సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు.

వికాస్ దూబే ప్రయాణీస్తున్న వాహనం ప్రమాదానికి గురైందని చూపించేందుకు భౌతిక ఆధారాలున్నాయని యూపీ పోలీసులు చెప్పారు. తెలంగాణ ఎన్ కౌంటర్ లో నిందితులు నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసుల మాట మాత్రమే సాక్ష్యమని అఫిడవిట్ లో ప్రస్తావించారు.

భద్రతా కారణాల దృష్ట్యా  వాహనాలను మార్చినట్టుగా పోలీసులు తెలిపారు. కాన్వాయ్ లో 15 మంది పోలీసులతో పాటు మూడు వాహనాలు ఉన్నాయన్నారు. ఈ కారణంగా దూబేను చేతితో పట్టుకోలేదని పోలీసులు వివరించారు.

మార్గంలో ఎక్కడా కూడ మీడియా వాహనాన్ని ఆపలేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో వాహనం స్కిడ్ అయినట్టుగా గుర్తులు కూడ ఉన్నాయని అఫిడవిట్ లో పోలీసులు స్పష్టం చేశారు.

ఈ కేసు విచారణను సీబీఐ లేదా ఎన్ఐఏకు బదిలీ చేయాలనే పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారించనుంది. ఈ నెల 3వ తేదీన కాన్పూరు సమీపంలో వికాస్ దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios