Asianet News TeluguAsianet News Telugu

Subhash Chandra Bose: సుభాష్ చంద్ర‌బోస్ తోనే భార‌త్‌కు స్వాతంత్య్రం: అర్ధేందు బోస్

Netaji Subhash Chandra Bose: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించార‌ని ఆయ‌న మేన‌ల్లుడు అర్ధేందు బోస్ అన్నారు.  భార‌త్ కు స్వాతంత్య్రం తెచ్చిపెట్టింది జాతిపిత మ‌హాత్మా గాంధీ శాంతి ఉద్య‌మం కాద‌నీ, బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ కార్య‌క‌లాపాలు ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టాయ‌ని అన్నారు.
 

Not Gandhis peace movement but Netajis Azad Hind Fauj brought independence to India: SC Boses nephew
Author
Hyderabad, First Published Jan 24, 2022, 12:45 AM IST

Netaji Subhash Chandra Bose: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించార‌ని ఆయ‌న మేన‌ల్లుడు అర్ధేందు బోస్ అన్నారు.  భార‌త్ కు స్వాతంత్య్రం తెచ్చిపెట్టింది జాతిపిత మ‌హాత్మా గాంధీ (Mahatma Gandhi) శాంతి ఉద్య‌మం కాద‌నీ, బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ (Azad Hind Fauj), నేతాజీ (Netaji Subhash Chandra Bose) కార్య‌క‌లాపాలు ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టాయ‌ని అన్నారు. భార‌త తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. నేతాజీ సుభాష్ చంద్ర‌ బోస్‌ను పక్కన పెట్టారని ఆరోపించారు. బోస్ జీవిత చ‌రిత్ర‌ను, సంబందిత క‌థ‌ల‌ను చరిత్ర పుస్తకాలకు దూరంగా ఉంచారని పేర్కొన్నారు. 

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన మేనల్లుడు అర్ధేందు బోస్ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. "భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది జాతిపిత మ‌హాత్మా గాంధీ  (Mahatma Gandhi) శాంతి ఉద్యమం కాదు. ఆజాద్ హింద్ ఫౌజ్ మరియు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌ల  కార్యకలాపాలు ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టాయి. ఇంగ్లాండ్ ప్రధాని, క్లెమెంట్ రిచర్డ్ అట్లీ కూడా దీనిని అంగీక‌రించారు" అని అర్ధేందు బోస్ అన్నారు. అలాగే, "నేతాజీ - జవహర్‌లాల్ నెహ్రూ మధ్య చాలా ఘర్షణ జరిగింది. ఇది స్పష్టంగా ఉంది,  కాబట్టి, నేతాజీని చరిత్రకు మరొక వైపు ఉంచాలని నిర్ణయించుకున్నారు" అని ఆయన ఆరోపించారు. 

చరిత్ర పుస్తకాల్లో సుభాస్ చంద్ర‌బోస్ (Netaji Subhash Chandra Bose) గురించి పెద్దగా రాయలేదనీ, నేటి యువకులకు గొప్ప స్వాతంత్య్ర  సమరయోధుడు నేతాజీ, అతని ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి పెద్దగా తెలియదని అర్ధేందు బోస్ విచారం వ్యక్తం చేశారు. కాగా, గత ఏడాది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రభుత్వం జనవరి 23ని పరాక్రమ్ దివస్‌గా ప్రకటించింది. 1897 జనవరి 23న జన్మించిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ (Netaji Subhash Chandra Bose) భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయ‌న ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించి.. ఉద్య‌మం కొన‌సాగించారు. 

 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) జన్మదినం నేప‌థ్యంలో దేశంలో జనవరి 24కి బదులుగా జనవరి 23 నుంచి  గణతంత్ర దినోత్సవ వేడుకలను జ‌రుపుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ వేడుక‌లు జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు గురైన జనవరి 30న ముగుస్తాయి. కాగా, నేతాజీ 125వ జయంతి సంద‌ర్భంగా  దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్ర‌మంలోనే ప్రధాని మోడీ నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈ రోజు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రారంభించారు. గణతంత్ర వేడుకలను షురూ చేశారు. దేశమంతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నదని, ఈ సందర్భంలో ఆయన విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని వెల్లడించడం సంతోషంగా ఉన్నదని ప్రధాని మోడీ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios