సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మక్కల్ నీది మయ్యన్ అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కమల్ హసన్, రజనీకాంత్ కలిసి పోటీ చేయనున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో కమల్ హసన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. 

తమిళ భాష మాట్లాడి అధికారంలోకి వచ్చిన వారు, తమిళాన్ని మరిచిపోయారని మండిపడ్డారు. తమిళ ప్రజలు అన్ని భాషలనూ నేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారని, అత్యంత మధురమైన భాష తమిళమని ఆయన అన్నారు. 

అలాగని హిందీని ఇష్టపడమన్నట్లు కాదని, కానీ.. తమిళ భాష కూడా మధురంగానే ఉంటుందని కమల్ హసన్ అన్నారు.

రజనీకాంత్ పెట్టే పార్టీతో పొత్తుకు తాము సిద్దంగా ఉన్నామని సినీ నటుడు ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ అన్నారు. మంగళవారం నాడు ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలున్నా పక్కన పెడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో రజనితో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు.

తమ మధ్య స్నేహాం అలాగే ఉందని ఆయన తేల్చి చెప్పారు. రజనీకాంత్ ఒక ఫోన్ కాల్ చేస్తే తాను పలుకుతానని ఆయన చెప్పారు. రజనీకాంత్ పార్టీ ఎజెండా  ఇంకా స్పష్టంగా తెలియదన్నారు. రజనీ పార్టీ ఎజెండా విషయాలు బయటకు వచ్చాక పొత్తు సంగతి నిర్ణయిస్తామన్నారు. 

ఇదిలా ఉంటే రజనీ పార్టీ పేరు మీద, పార్టీ గుర్తు మీద సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సైకిల్ గుర్తు అని ఆటో గుర్తు అని, రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి అని.. ఇలా అనేక ఊహాగానాలు బయల్దేరాయి. అయితే ప్రచారంలో ఉన్న ఊహాగానాలన్నీ తప్పని..డిసెంబర్ 31 లేదా జనవరిలోనే పార్టీ పేరు, పార్టీ గుర్తు ప్రకటిస్తానని రజనీకాంత్ తెలిపారు.