సారాంశం

North East Express: బీహార్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాత్రి ప్రమాదానికి గురైంది. బీహార్ లోని బక్సర్ జంక్షన్ నుంచి రైలు బయల్దేరిన కొద్దిసేపటికే రఘునాథ్‌పూర్ స్టేషన్‌లో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

North East Express:  బీహార్‌లోని బక్సర్ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. అందుతున్న సమాచారం ప్రకారం.. రైలులోని మూడు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటన డీడీయూ పాట్నా రైల్వే సెక్షన్‌లోని రఘునాథ్‌పూర్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. జిల్లా యంత్రాంగం, పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

ఈ రైలు ఢిల్లీ నుంచి పాట్నా వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఈ రైలు బక్సర్ జంక్షన్ నుండి పాట్నాకు బయలుదేరింది. ఈ రైలు రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంతో ఇతర రైళ్లను నిలిపివేశారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. క్షతగాత్రులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని తూర్పు మధ్య రైల్వే అధికారులు తెలిపారు.