న్యూఢిల్లీ: ఎల్పీజీ  సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్  ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలో వంట గ్యాస్ ధర తగ్గడం ఇది రెండోసారి. తగ్గించిన వంట గ్యాస్  ధర సోమవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి రానుంది.

డిసెంబర్ 1వ తేదీన సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.6.52 తగ్గించారు. జూన్ నుండి ఆరుసార్లు  వరుసగా ఆరు దఫాలు పెరిగింది కానీ, ఈ నెలలో వరుసగా రెండోసారి గ్యాస్ ధర తగ్గింది. నూతన సంవత్సరం కానుకగా సబ్సీడీ సిలిండర్ ధర తగ్గింది.

సబ్సీడీయేతర సిలిండర్ ధరను ఏకంగా రూ. 120.50 తగ్గించినట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది.