Asianet News TeluguAsianet News Telugu

సంజయ్ రౌత్‌కు భారీ షాక్.. ఆ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ ..

శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు దాఖలైంది. కేసు విచారణకు హాజరు కానందుకు అతనిపై కోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Non bailable warrant against Sanjay Raut
Author
First Published Jan 7, 2023, 12:14 AM IST

మనీ లాండరింగ్ ఆరోపణలపై జైలుకు వెళ్లి కొద్ది రోజుల క్రితమే బెయిలుపై విడుదలైన శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్‭కు మరో భారీ షాక్ తగిలింది. తాజాగా నమోదైన కేసులో కనీసం బెయిల్ కూడా పొందకుండా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 

ఇంతకీ ఏం జరిగింది ?

బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేయడంతో బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య కోర్టుకు ఎక్కారు. వారు సంజయ్ రౌత్ పై పరువునష్టం దావా వేశారు. అయితే.. పరువునష్టం ఫిర్యాదులో విచారణకు హాజరు కానందుకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన తర్వాత  సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ వారెంట్ జారీ చేసింది.

సంజయ్ రౌత్ హాజరుకాలేదని తేలడంతో పాటు కోర్టు విచారణ నుంచి మినహాయింపు కోరిన దరఖాస్తును తిరస్కరించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అనంతరం ఫిర్యాదుదారుడి వాంగ్మూలాన్ని కొనసాగించనున్న కోర్టు విచారణను జనవరి 24కి వాయిదా వేసింది. కోర్టులో విచారణ సందర్భంగా మేధా సోమయ్య తరపు న్యాయవాది మాట్లాడుతూ.. కోర్టు ఆదేశించినప్పటికీ సంజయ్ రౌత్ హాజరుకాలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. “నాకు బాంబే హైకోర్టులో వేరే విషయం ఉంది. ట్రాఫిక్ కారణంగా.. నేను సెవ్రీ కోర్టు విచారణకు హాజరు కాలేకపోయాను. అయితే.. ఆ తర్వాత రోజు కోర్టుకు హాజరయ్యాను అని తెలిపారు. 

ముంబై సమీపంలోని మీరా-భయందర్ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం , నిర్వహణకు సంబంధించి బీజేపీ నేత కిరీట్ సోమయ్య, మేథా సోమయ్య 100 కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడ్డారంటూ సంజయ్ రౌత్ గతంలో ఆరోపించారు.  ఆ కుంభకోణంలో తనకు, తన భర్త ఎలాంటి ప్రమేయం లేదనీ, సంజయ్ రౌత్ తమపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే ఆరోపణ చేశారని కిరీట్ సోమయ్య కోర్టును ఆశ్రయించారు . భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 499 (పరువు నష్టం) కింద సంజయ్ రౌత్‌పై కేసు పెట్టారు. సంజయ్ రౌత్..  శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నాయకుడు.

Follow Us:
Download App:
  • android
  • ios