Asianet News TeluguAsianet News Telugu

నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం 12 బ్రహ్మోస్ మిస్సైల్స్‌కు సమానమైన పేలుడు పదార్థాలు.. షాకింగ్ వివరాలివే

ఢిల్లీలో నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్‌ను ఈ రోజు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతకు 3,500 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. ఇది 12 బ్రహ్మోస్ మిస్సైల్స్‌కు సమానం.

noida supertech twin towers demolished.. explosives equal to 12 brahmos missiles
Author
First Published Aug 28, 2022, 3:57 PM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్‌ను ఈ రోజు నేలకూల్చారు. నోయిడాలోని ఈ ట్విన్ టవర్స్ కూల్చడానికి సుమారు 3,500 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. ఇది మూడు అగ్ని-v క్షిపణులు, 12 బ్రహ్మోస్ క్షిపణులు లేక నాలుగు ప్రిథ్వి క్షిపణులకు సమానం కావడం గమనార్హం.

ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే కూడా ఎత్తైన ఈ సూపర్ టెక్ ట్విన్ టవర్స్ నోయిడా సెక్టార్ 93ఏలో నిర్మించారు. అక్కడి నివాసుల అభ్యంతరంతో ఈ టవర్‌ను కూల్చాల్సి వచ్చింది. ఈ ట్విన్ టవర్స్ నిర్మాణంపై వారు కోర్టుకు ఎక్కడంతో వారి అభ్యంతరాలు సమంజసం అయినవేనని కోర్టు భావించింది. ఈ ట్విన్ టవర్స్‌ను కూల్చేయాలని ఆదేశించింది. ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు రూ. 20 కోట్లు ఖర్చు పెట్టారు. క్షణాల్లో ఈ ట్విన్ టవర్స్ నేలమట్టం అయింది. దుమ్ము దూళిగా మారిపోయింది. భారత దేశ చరిత్రలో ఇంత ఎత్తైన నిర్మాణాన్ని ఇది వరకు కూల్చేయలేదు.

అగ్ని-5 ఐసీబీఎంను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లు అభివృద్ధి చేశాయి. దీని బరువు 50 వేల కిలోలకు సమానం. ఈ మిస్సైల్‌లో 1,500 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లుతుంది.

బ్రహ్మోస్ క్షిపణి 300 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లుతుంది. ఇది టాప్ సూపర్‌సోనిక్ వేగంతో దూసుకెళ్తుంది. ఇది డీఆర్‌డీవో, రష్యాకు చెందిన ఎన్‌పీవోఎంలు కలిసి అభివృద్ధి చేశాయి. ఆర్మీలో ప్రవేశ పెట్టిన ఈ క్షిపణిని భారత త్రివిధ దళాల దగ్గర ఉన్నాయి. 

ఈ క్షిపణి భూమి పై నుంచి భూమి దాడి చేస్తుంది. ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. దీనిని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios