కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తి ఇంట్లో బర్త్ డే పార్టీకి హాజరు కావడంతో ఓ స్కూల్ కు సెలవులు ప్రకటించారు. ఢిల్లీలోని నోయిడాకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. దీంతో స్కూల్ కు సెలవులు ఇచ్చారు.
న్యూఢిల్లీ: కరోనా భయంతో నోయిడాలో ఓ స్కూల్‌కు సెలవు ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇంటికి స్కూల్ విద్యార్థులు పుట్టిన రోజు పార్టీకి హాజరయ్యారు.దీంతో విద్యార్ధులకు వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు వీలుగా ఈ స్కూల్‌ను మూసివేశారు.
ఇటలీ నుండి వచ్చిన ఢిల్లీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. గత వారం రోజుల క్రితం వ్యాధి సోకిన వ్యక్తి ఇంట్లో బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ బర్త్‌డే వేడుకలకు ఈ స్కూల్ నుండి ఐదు కుటుంబాలు హాజరయ్యాయి.
ఈ విషయం తెలుసుకొన్న స్కూల్ యాజమాన్యం వెంటనే స్కూల్‌కు సెలవు ప్రకటించింది. బర్త్ డే పార్టీకి అటెండ్ అయిన ఐదు కుటుంబాలతో పాటు స్కూల్ విద్యార్ధులంతా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని స్కూల్ యాజమాన్యం సూచించింది. ఈ మేరకు స్కూల్ కు సెలవులు ప్రకటించింది.
మరో వైపు ఇదే ప్రాంతానికి చెందిన మరో స్కూల్‌కు కూడ సెలవులు ప్రకటించింది స్కూల్ యాజమాన్యం. స్కూల్‌ను శుభ్రం చేసిన తర్వాత తిరిగి స్కూల్‌ను తెరిపిస్తామని ప్రకటించింది.
కరోనా భయంతో స్కూల్‌కు సెలవులు ప్రకటించారు. స్కూళ్లలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఉంటారు. ఒక్కరికి ఈ వ్యాధి సోకినా పెద్ద ఎత్తున అందరికీ ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకొన్నారు.
