Sidhu Moose Wala: ప్రముఖ పంజాబీ గాయకుడు, ర్యాప‌ర్ సిద్ధూ మూసేవాలాను మాన్సా జిల్లాలో గుర్తుతెలియని దుండగులచే కాల్చిచంపారు. ఈ ఘ‌ట‌న‌పై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ "ఇందులో ప్రమేయం ఉన్నవారిని ఎవ‌రినీ విడిచిపెట్టం" అని అన్నారు. 

Punjab : కాంగ్రెస్ నాయ‌కుడు, పంజాబీ గాయకుడు, ర్యాప‌ర్ సిద్ధూ మూస్ వాలా దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. మ‌న్సా జిల్లాలో గుర్తుతెలియ‌ని దుండ‌గులు ఆయ‌నను కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న పంజాబ్ ముఖ్య‌మంత్రి, ఆప్ నాయ‌కుడు భగవంత్ సింగ్‌ మాన్ ఆదివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న వారిని ఎవ‌రైనా స‌రే వ‌దిలిపెట్ట‌బోమ‌ని అన్నారు. చ‌ట్టం ప్ర‌కారం వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూస్ వాలాను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.. అదికూడా ఆయ‌న‌కు క‌ల్పించిన భ‌ద్ర‌త‌ను ఉపసంహరించుకున్న ఒక రోజు తర్వాత ఇలా జ‌రిగింది. 

"సిద్ధు మూస్ వాలా దారుణ హత్యతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘ‌ట‌న‌లో ప్రమేయం ఉన్నవారిని ఎవరూ విడిచిపెట్టరు. నా ఆలోచనలు మరియు ప్రార్థనలు అతని కుటుంబం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులతో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Scroll to load tweet…

కొందరు గుర్తుతెలియని దుండగులు మూసేవాలాపై కాల్పులు జరిపారని, పలు బుల్లెట్లు అతడిని తాకాయని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (మాన్సా) గోబిందర్ సింగ్ తెలిపారు.గాయకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి తన జీపులో ప్రయాణిస్తున్నప్పుడు దాడి చేశారని సింగ్ చెప్పారు. అనంతరం మాన్సా సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ రంజీత్‌ రాయ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. సిద్ధూ మూసేవాలా మృతి చెందినట్లు సివిల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుల్లెట్ గాయాలు తగిలిన మరో ఇద్దరిని మరో ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

 పంజాబీ గాయ‌కుడు, కాంగ్రెస్ నాయ‌కుడు సిద్దూ మూస్ వాలా హ‌త్య నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ).. పంజాబ్ ఆమ్ ఆద్మీ (ఆప్) స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించింది. ఆప్ అధినేత, ఢ‌ల్లీ ముఖ్య‌మంత్రి ఆర‌వింద్ కేజ్రీవాల్ పై కూడా తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రిమోట్ కంట్రోల్ ద్వారా పంజాబ్‌ను పరిపాలిస్తున్నారని, పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కారణమని బీజేపీ ఆదివారం ఆరోపించింది. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో మూస్ వాలాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. రాష్ట్ర ప్రభుత్వం మూస్‌వాలా భద్రతను ఉపసంహరించుకున్న ఒక రోజు తర్వాత ఈ హ‌త్య జ‌రిగింది. సిద్ధూ మూస్ వాలా హత్యపై బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. భద్రతను తొలగించిన వారి పేర్లతో కూడిన రహస్య జాబితాను బహిరంగపరిచారని ఆరోపించారు.