పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నాటికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖాళీ అవుతుందన్నారు బీజేపీ నేత సువేందు అధికారి. టీఎంసీ ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అంటూ సెటైర్లు వేశారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో హౌరాలో నిర్వహించిన భారీ బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజకీయ పార్టీగా ఎక్కువ కాలం కొనసాగదని.. అదో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సువేందు ఆరోపించారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి టీఎంసీ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీలో ఎవరూ మిగలరని.. మొత్తం ఖాళీ అవుతుందంటూ అధికారి టీఎంసీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి రాజిబ్‌ బెనర్జీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో మనకు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కావాలని స్పష్టం  చేశారు. సోనార్‌ బంగ్లా సాకారం కావాలంటే కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ మనకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆయన వ్యాఖ్యానించారు.

పశ్చిమబెంగాల్‌కు చెందిన మాజీ మంత్రి రాజిబ్‌ బెనర్జీ సహా మరో నలుగురు కీలక నేతలు శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో ఎమ్మెల్యేలు వైశాలి దాల్మియా, ప్రభిర్‌ ఘోషాల్‌, హౌరా మాజీ మేయర్‌ రతిన్‌ చక్రవర్తి, రుద్రానిల్‌ ఘోష్‌లు ఉన్నారు.