Asianet News TeluguAsianet News Telugu

భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తత: మోడీతో అసలు ట్రంప్ మాట్లాడనే లేదు

తాజాగా వాషింగ్టన్ లో రిపోర్టర్లతో మాట్లాడుతూ, చైనా సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేసారని, తాను మాట్లాడినప్పుడు కూడా మోడీ ఇదే విషయం చెప్పారని అన్నారు ట్రంప్. 

No talks between PM Modi, US President Donald Trump on India-China face-off, MEA Sources
Author
New Delhi, First Published May 29, 2020, 10:46 AM IST

తాజాగా వాషింగ్టన్ లో రిపోర్టర్లతో మాట్లాడుతూ, చైనా సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేసారని, తాను మాట్లాడినప్పుడు కూడా మోడీ ఇదే విషయం చెప్పారని అన్నారు ట్రంప్. 

చైనా కూడా ఈ విషయంలో అసంతృప్తిగానే ఉంటుందని తాను అనుకుంటున్నట్టు, అవసరమైతే, ఇరు దేశాలకు అంగీకారమైతే తాను మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమన్నారు ట్రంప్. 

అయితే... భారతీయ విదేశాంగశాఖ వర్గాలు మాత్రం ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు అన్న విషయాన్నీ తోసిపుచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో అదికూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ కి సంబంధించి మోడీతో ట్రంప్  మాట్లాడారని,ఆ తరువాత ఇంతవరకు మాట్లాడింది లేదని అంటున్నారు. 

గత బుధవారం ట్రంప్ చైనా, భారత్ ల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా సిద్ధమని, ఇదే విషయాన్నీ ఇరు దేశాలకు కూడా తెలియపరిచామని ట్వీట్ చేసాడు. 

"భారత్, చైనాలు ఇరు దేశాల మధ్య కూడా సరిహద్దు వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా  ,ఇప్పటికే ఈ విషయాన్నీ ఇరు దేశాలకు కూడా తెలిపాము. ధన్యవాదాలు" అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు. 

గతంలో భారత్, పాకిస్తాన్ విషయంలో కూడా ఇలానే మధ్యవర్తిత్వం చేస్తానంటూ పలుమార్లు ట్రంప్ అవాకులు చవాకులు పేలిన విషయం తెలిసిందే! అప్పుడు భారత్ ట్రంప్ ఆఫర్ ను కరాఖండిగా  తిరస్కరించడం,ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక విషయం అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే!

ఇకపోతే, చైనా సరిహద్దుల్లో కాలుదువ్వుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిధ దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని చర్చించారు. అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌తోనూ మోడీ మాట్లాడారు.

సరిహద్దు భద్రతలపై త్రివిధ దళాల అధిపతులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత మోడీ ఈ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

మే 5న పాంగాంగ్ ప్రాంతంలో భారత్- చైనా దేశాల సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండు వైపులా సైనికులు తీవ్ర గాయాల పాలయ్యారు. నాటి నుంచి లడఖ్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

తిరిగి మే 9న ఉత్తర సిక్కింలోనూ ఇదే తరహా పరిస్ధితులు తలెత్తాయి. తమ గస్తీకి చైనా సైనికులు పదే పదే అడ్డొస్తున్నారని భారత సైన్యం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios