‘2024లో జమిలి ఎన్నికలు లేవు.. ఇప్పుడు సాధ్యంకావు’
2024లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదని లా కమిషన్ వర్గాలు వెల్లడించాయి. 2024 ఎన్నికలకు ముందే వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేయడం అసాధ్యం అని వివరించాయి. జమిలి ఎన్నికల విధానంపై ఇంకా పనులు జరుగుతున్నాయని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజు అవస్తీ బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: 2024లో జమిలి ఎన్నికలు జరగవని లా కమిషన్ వర్గాలు చెప్పాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే వన్ నేషన్, వన్ ఎలెక్షన్ విధానాన్ని అమల్లోకి తేవడం సాధ్యం కాదని లా కమిషన్ భావిస్తున్నట్టు తెలిపాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే జమిలి ఎన్నికలపై లా కమిషన్ రిపోర్టు ప్రచురితం కానుంది. దీంతో 2029లో జమిలి ఎన్నికలు సాధ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లతోపాటు జమిలి ఎన్నికలు కూడా 2029 నుంచి అమల్లోకి వస్తాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్తీ ఇండియా టుడేతో బుధవారం మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలపై ఇంకా పనులు జరుగుతున్నాయని తెలిపారు.
దేశంలో ఉమ్మడి ఎన్నికల విధానాన్ని అమల్లోకి తేవడానికి రాజ్యాంగ సవరణలు అవసరం అని ఈ కమిషన్ సూచించబోతున్నట్టు లా కమిషన్ వర్గాలు తెలిపాయి. అలాగే, లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఈ కమిషన్ ఫోకస్ పెట్టనున్నట్టు వివరించాయి.
Also Read: రాంగ్ ఇంజెక్షన్ ఇవ్వడంతో బాలిక మృతి.. డెడ్ బాడీని వదిలిపెట్టి హాస్పిటల్ స్టాఫ్ పరార్
2022 డిసెంబర్‌లో 22 లా కమిషన్ ఆరు ప్రశ్నలను రూపొందించి భాగస్వాములను వాటిపై అభిప్రాయాలు సేకరించింది. రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల కమిషన్, బ్యూరోక్రాట్లు, అకాడమీషియన్లు, నిపుణుల నుంచి జమిలి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు అడిగింది. ఈ కమిషన్ రిపోర్టు 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే పబ్లిష్ చేయనుంది.