Shivaji Jayanti :భారత వీరత్వానికి ప్రతీక.. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన మరాఠా సామ్రాజ్యపు యోధుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేపథ్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహించడానికి మహారాష్ట్ర ప్రజలు సిద్దమవుతున్నారు. అయితే, ఇంకా రాష్ట్రంలో కోవిడ్-19 ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్రపతి శివాజీ జయంతి రోజున (ఫిబ్రవరి 19) రాష్ట్రంలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.
Shivaji Jayanti : భారత వీరత్వానికి ప్రతీక.. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన మరాఠా సామ్రాజ్యపు యోధుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేపథ్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహించడానికి మహారాష్ట్ర ప్రజలు సిద్దమవుతున్నారు. అయితే, ఇంకా రాష్ట్రంలో కోవిడ్-19 ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్రపతి శివాజీ జయంతి రోజున (ఫిబ్రవరి 19) రాష్ట్రంలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలో ఫిబ్రవరి 19న జరిగే 'శివజయంతి' - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి - సందర్భంగా జరిగే 'శివజ్యోతి' ర్యాలీలలో కనీసం 200 మంది పాల్గొనవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది.
మహారాష్ట్ర సర్కారు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) జయంతి రోజున (ఫిబ్రవరి 19న) బైక్ ర్యాలీలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించవద్దని రాష్ట్ర హోం శాఖ ప్రజలను కోరింది. దీనికి సంబంధించి హోం శాఖ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రజారోగ్య సంబంధిత నిబంధనలకు కట్టుబడి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రజలను కోరారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి దృష్ట్యా... రాష్ట్రంలో ఇంకా కరోనా ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి శంభురాజ్ దేశాయ్ ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రికి సమర్పించినట్లు ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే జారీ చేసిన మార్గదర్శకాలలో, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న COVID-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బైక్ ర్యాలీలు, ఊరేగింపులకు వెళ్లకుండా ఉండాలని ప్రజలను హోం శాఖ ప్రజలను కోరింది. అయితే, కోవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ.. సామాజిక దూర నిబంధనలను పాటించడం ద్వారా ఛత్రపతి శివాజీ విగ్రహాలు / చిత్రపటాలకు పూలమాల వేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
కాగా, మహారాష్ట్రలో మరాఠ యోధుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) జయంతి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఛత్రపతి శివాజీ జన్మించిన శివనేరి కోట వద్ద, రాష్ట్రంలోని ఇతర కోటల వద్ద, అనేక ప్రాంతాల్లో ఫిబ్రవరి 18 అర్ధరాత్రి నుంచే ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున ప్రజలు ఇందులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సర్కారు చర్యలను ప్రారంభించింది. జయంతిపై ఆంక్షలు మాత్రం ఉండవు కానీ.. ప్రజలు గూమిగూడకుండా తక్కువ సంఖ్యలో కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సర్కారు పేర్కొంది.
మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji Maharaj) జయంతిని పురష్కరించుకుని ప్రతి సంవత్సరంవివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఈ సారి కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. అయితే ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించకూడదనీ, కేబుల్ నెట్‌వర్క్‌లు లేదా ఆన్‌లైన్ మీడియా ద్వారా ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
