Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: ఫేస్ మాస్కులు లేకపోతే నో పెట్రోల్, డీజీల్

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు గోవా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తుంది.మాస్కులు లేకపోతే పెట్రోల్,డీజీల్ లను  వాహనదారులకు విక్రయించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోల్, డీజీల్ బంకుల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
 

No Petrol, Ration in Goa to Those Not Wearing Masks as Govt Ramps up Efforts to Check Covid-19 Spread
Author
Goa, First Published May 1, 2020, 3:09 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు గోవా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తుంది.మాస్కులు లేకపోతే పెట్రోల్,డీజీల్ లను  వాహనదారులకు విక్రయించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోల్, డీజీల్ బంకుల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

గురువారం నాడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటి(ఎస్ఈసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటి సమావేశమైంది. కరోనాను అరికట్టేందుకు మాస్కులు లేదా ఫేస్ కవర్లను కచ్చితంగా ఉపయోగించాలని ఈ కమిటి నిర్ణయించింది.

also read:మంత్రులతో భేటీ: లాక్‌డౌన్ పై మోడీ నిర్ణయంపై ఉత్కంఠ

మాస్కులు ధరించకుండా బయట తిరిగిన సుమారు వెయ్యి మంది నుండి జరిమానా వసూలు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. మాస్కులు లేకపోతే రేషన్ కూడ ఇవ్వబోమని తేల్చి చెప్పింది. దీంతో పెట్రోల్, డీజీల్  కావాలంటే తప్పనిసరిగా మాస్కులతో  వాహనదారులు  పెట్రోల్ బంకులకు చేరుకొంటున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. గోవాలో కరోనా పాజిటివ్ కేసులు ఏడు నమోదయ్యాయి. 

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కానీ గోవాలో మాత్రం కరోనా కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి పర్యాటక కేంద్రంగా  ప్రసిద్ది చెందిన గోవాలో కరోనాను ప్రభుత్వం అదుపులో ఉంచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios