కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ఈ నెల 22న ప్రధాని నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం రైల్వే శాఖపై పడింది. ఏ పాసింజర్ రైలు కూడా శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు బయల్దేరదని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

అయితే మార్గమధ్యంలో ఉన్న రైళ్లను మాత్రం గమ్యాస్థానం చేరే వరకు అనుమతిస్తామని వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, సికింద్రాబాద్ సబర్బన్ రైలు సర్వీసులు పరిమితంగానే సేవలు అందిస్తాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

Also Read:కరోనాను ఇక తేలికగా తీసుకోలేం.. జనతా కర్ఫ్యూ పాటించండి: మోడీ

తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఫుడ్ ప్లాజాలు, రీఫ్రెష్‌మెంట్ రూములు, జన ఆహార్, సెల్ కిచెన్లను సైతం మూసివేస్తున్నట్లు తెలిపింది.

కాగా కరోనా దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారతీయ రైల్వే  గురువారం 84 రైళ్లను రద్దు చేయగా, మరో 90 రైళ్లను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రద్దయిన రైళ్ల సంఖ్య 245కు చేరింది. మార్చి నుంచి 20 నుంచి మార్చి 31 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 

కరోనాకి, మనకి మధ్యలో వైద్యులు సైన్యంలా పనిచేస్తున్నారని మార్చి 22 ఆదివారం నాడు వీరందరికీ మనం కృతజ్ఞతలు చెప్పాలని మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాల పాటు మన ఇంట్లోనే కూర్చొని వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రధాని కోరారు.

Also Read:కరోనావైరస్ కట్టడికి పవన్ కల్యాణ్ చిట్కాలు

రోటీన్ చెకప్‌ల కోసం వైద్యల వద్దకు వెళ్లడం తగ్గించాలని అత్యవసరం కాకపోతేనే సర్జరీలు కూడా వాయిదా వేసుకోవాలని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల ఆర్ధిక సమస్యలు కూడా ఉన్నాయని.. వీటిని ఎదుర్కొనేందుకు టాస్క్‌ఫోర్స్‌ను నియమించామని మోడీ స్పష్టం చేశారు.

ఆర్ధిక మంత్రి ఆధ్వర్యంలో ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని, ఆర్ధిక సమస్యల తీవ్రతను తగ్గించడానికి ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలు చేస్తుందని ప్రధాని తెలిపారు. ఇళ్లతో పాటు వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్లని మానవత్వంతో చూడాలని, వాళ్లు పనికి రాలేకపోయిన పక్షంలో జీతాలు కట్ చేయొద్దని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.