దేశంలో వున్నవన్ని నకిలీ హిందుత్వలేనన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. బాలాసాహేబ్‌ను చివరి రోజుల్లో వదిలేసిన వారు ఇప్పుడు ఆయన పేరును ఎందుకు తీస్తున్నారని .. రాజ్ థాక్రేకు చురకలు వేశారు. మహారాష్ట్రలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లౌడ్‌స్పీకర్లు లేవని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. 

Maharashtraలో ఈరోజు ఎలాంటి నిరసనలు జరగడం లేదని, ఇదంతా ఒకరోజు డ్రామా అన్నారు Shiv Sena సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు Sanjay Raut . loudspeakers అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి MNS అధినేత Raj Thackeray ఇచ్చిన డెడ్‌లైన్ ఇవాళ్టీతో పూర్తి కావొస్తుండడంతో మీడియా దీనిపై ప్రశ్నించింది. దీనికి రౌత్ పై విధంగా స్పందించారు. Veer Savarkar, Balasaheb మాత్రమే హిందుత్వ గురించి చెప్పారని, శివసేన పాఠశాలలో చెప్పేది నిజమైన హిందుత్వ అని రౌత్ అన్నారు.

బాలాసాహేబ్ చివరి రోజుల్లో ఆయనను వదిలేసిన వారు ఇప్పుడు ఆయన పేరును ఎందుకు తీస్తున్నారని సంజయ్ రౌత్ ప్రశ్నంచారు. బాలాసాహేబ్, వీర్ సావర్కర్.. వీరిద్దరూ మాత్రమే హిందుత్వ గురించి ఈ దేశానికి వివరించారని ఆయన పేర్కొన్నారు. మిగిలినవన్నీ నకిలీ హిందుత్వలని సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లౌడ్‌స్పీకర్లు లేవని.. రాష్ట్రంలో శాంతి నెలకొని ఉందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. 

కాగా.. మహారాష్ట్ర రాజకీయాలను లౌడ్ స్పీక‌ర్ల వివాదం కుదుపేస్తోంది. వెన‌క్కి తగ్గ‌దేలే అంటూ మ‌హారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే ముందుకు సాగుతున్నారు. మే 3 త‌ర్వాత ఎలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగినా త‌న బాధ్య‌త ఉండ‌ద‌నిరాజ్ థాక్రే హెచ్చ‌రించారు. మ‌సీదుల‌పై లౌడ్ స్పీక‌ర్లు, మైకుల తొల‌గింపున‌కు సంబంధించి ఆయ‌న ఇచ్చిన గ‌డువును మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుచేస్తూ.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో రాజ‌కీయాలు హీటెక్కాయి. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం నుంచి మ‌హారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో మ‌సీదుల‌పై లౌడ్ స్పీక‌ర్లు, మైకులు ఆన్ చేసిన స‌మ‌యంలో.. ఎంఎన్ఎస్ కు చెందిన కార్య‌క‌ర్త‌లు లౌడ్ స్పీక‌ర్ల‌ను మ‌సీదుల ముందు పెట్టి.. హ‌నుమాన్ చాలీసాను ప్లే చేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లిగే అవ‌కాశ‌ముండ‌టంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే రాజ్ థాక్రే.. 'తన ప్రభుత్వం ఏర్పడినప్పుడు మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగిస్తాను' అని శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన పాత వీడియో క్లిప్ ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో 36 సెకన్ల నిడివి గల వీడియోను ట్వీట్ చేశారు.. ఇందులో బాలాసాహెబ్ శివసేన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. దేశం యొక్క అభివృద్ధి మతం మధ్యలో రాని విధంగా ఉండాలని అందులో ఆయ‌న వ్యాఖ్య‌నించారు. ప్ర‌జలు ఎలాంటి అసౌకర్యానికి గురికావద్దని వీడియో చెప్ప‌డం విన‌వ‌చ్చు. 

'అజాన్' శబ్దంతో ప్రజలు ఇబ్బందిపడితే 100కి డయల్ చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాజ్ థాక్రే అంత‌కు ముందురోజు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. "రేపు మే 4వ తేదీన మీరు లౌడ్‌స్పీకర్ ఆజాన్‌తో మోగడం వింటుంటే, ఆ ప్రదేశాలలో హనుమాన్ చాలీసాను లౌడ్‌స్పీకర్లలో ప్లే చేయండి. అప్పుడే ఈ లౌడ్‌స్పీకర్ల అవరోధం ఏమిటో వారు గ్రహిస్తారని నేను హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను" అని MNS నాయకుడు రాజ్ థాక్రే ఆ లేఖ‌లో పేర్కొన్నారు.