కరోనా ఫ్రీ దిశగా కేరళ.. శుక్రవారం సున్నా కేసులు

దక్షిణాది రాష్ట్రం కేరళలో కూడా గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా కరోనా మహమ్మారి నుంచి బయటపడి మరో తొమ్మిది మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

no new covid 19 cases in kerala today

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే 35 వేల కేసులకు పైగా కేసులు నమోదవ్వగా.. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం... మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం తగ్గుముఖం పడుతుండటం ఊరట కలిగిస్తోంది.

Also Read:లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడగింపు: ఉత్తర్వులు జారీ

ఇప్పటికే దేశంలోని నాలుగు రాష్ట్రాలు కేసులు లేకుండా కరోనా ఫ్రీ అయ్యాయి. అయితే దక్షిణాది రాష్ట్రం కేరళలో కూడా గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అంతేకాకుండా కరోనా మహమ్మారి నుంచి బయటపడి మరో తొమ్మిది మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 392కు చేరుకుంది. ఇంకా రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో 102 మంది కరోనాతో పోరాడుతున్నారని  వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 498 కేసులు నమోదయ్యాయి. 

Also Read:ఈ రోజు ఆరు కేసులే, దాచేస్తే దాగేవి కావు: ప్రతిపక్షాలపై ఈటెల ధ్వజం

కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మే 17 వరకు దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగనుంది. విమాన, రైలు, మెట్రో, రోడ్డు మార్గంలో అంతర్రాష్ట్ర  ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios