భారత్ లో కరోనా ఫ్రీ జోన్.. ఎక్కడో తెలుసా..?

ముఖ్యంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి వాహనాలేవీ గోవాలోకి ప్రవేశించకుండా కట్టడి చేసింది. క్రీడా కార్యక్రమాలు, పోటీలు, మత సమావేశాలన్నీ వాయిదా వేసుకోవాలని ఆదేశించింది.

No new coronavirus cases reported in Goa as of 8:00 AM - Apr 18

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే.. ఓ రాష్ట్రంలో మాత్రం వైరస్ జాడ కనిపించడం లేదు. గత రెండు వారాలుగా దేశంలోని ఓ రాష్ట్రంలో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అది మరెక్కడో కాదు గోవా.

జనతా కర్ఫ్యూ’లో భాగంగా మార్చి 22 నుంచే గోవా అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేసింది. ముఖ్యంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి వాహనాలేవీ గోవాలోకి ప్రవేశించకుండా కట్టడి చేసింది. క్రీడా కార్యక్రమాలు, పోటీలు, మత సమావేశాలన్నీ వాయిదా వేసుకోవాలని ఆదేశించింది.

ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు సైతం సహకరించారు. ఫలితంగా ఏప్రిల్ 3 వరకు గోవాలో ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. బాధితుల్లో ఆరుగురు ఇప్పటికే వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఒక్కరు మాత్రం చికిత్స పొందుతున్నారు.

 ఈ బాధితుడు కూడా త్వరలోనే కోలుకుంటాడని, త్వరలోనే గోవాలో ‘సున్నా’ కరోనా కేసులతో.. దేశంలోనే తొలిసారి వైరస్-ఫ్రీ జోన్ కానుందని గోవా అధికారులు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా గోవాను అనుస‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios