Asianet News TeluguAsianet News Telugu

కనికరించని అంబులెన్స్ సిబ్బంది.. ఐదు నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని .. 200 కిలోమీటర్లు ప్రయాణం.

అంబులెన్స్ ధరలు చెల్లించలేక పశ్చిమ బెంగాల్‌లో ఓ తండ్రి తన ఐదు నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని బస్సులో 200 కి.మీ ప్రయాణించాడు. మృతదేహాన్ని సిలిగురి నుంచి కలియాగంజ్‌లోని తన ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ రూ.8000 అడిగాడు.

No Money For Ambulance, Bengal Man Travels 200 km In Bus With Son's Body KRJ
Author
First Published May 15, 2023, 1:30 AM IST

ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న అన్యాయాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరుపోతున్నాయి. వారు అడిగినంత ఇస్తేనే ముందుకు వస్తామంటూ తేల్చి పడేస్తున్నారు. పేదల పాలిట జలగల్లా పట్టి పీడిస్తున్నారు.ఈ క్రమంలో అంబులెన్లు లేక మృతదేహాలను భుజంపై పెట్టుకుని, తోపుడు బండ్లపై  శవాలను తీసుకెళ్లడం. లేదా ద్విచక్ర వాహనాల మీద తరలించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

సిగ్గుతో తలదించుకునే ఘటనలపై  అప్పటికప్పుడు తాత్కాలికంగా చర్యలు తీసుకోవడం షారా మమూలైంది. తాజాగా అంబులెన్స్ ఛార్జీలను చెల్లించలేక పశ్చిమ బెంగాల్‌లో ఓ తండ్రి తన ఐదు నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని బస్సులో 200 కి.మీ ప్రయాణించాల్సి వచ్చింది. మృతదేహాన్ని సిలిగురి నుంచి కలియాగంజ్‌లోని తన ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ రూ.8000 అడిగాడు.

వివరాల్లోకి వెళితే.. అసిమ్ దేవశర్మ వలస కార్మికుడు, ముస్తఫానగర్ గ్రామపంచాయత్‌లోని బెంగాల్‌లోని డంగీపరా గ్రామ నివాసి, అంబులెన్స్ డ్రైవర్లు కోరిన రుసుమును భరించలేక.. తన కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని బస్సులో 200 కి.మీ ప్రయాణించాడు. అలా చేయడం చేయడం తప్ప అతనికి వేరే మార్గం లేదు.  ఇటీవల అసిం దేవశర్మ కవలలిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని మొదట కలియాగంజ్ స్టేట్ జనరల్ హాస్పిటల్‌లో చేర్పించారు, అయితే వారి పరిస్థితి క్షీణించడంతో రాయ్‌గంజ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. పిల్లలిద్దరినీ తదుపరి చికిత్స కోసం ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లల ఆరోగ్యం క్షీణించడంతో అసిమ్ దేవశర్మ భార్య గురువారం ఒకరితో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. 

పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని తన ఇంటికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ కోసం నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని సంప్రదించాడు. అయితే ఆ పని చేసేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.8వేలు డిమాండ్ చేయడంతో షాక్ తిన్నాడు. వారు అడిగినంత ఇచ్చే డబ్బు అతని దగ్గర లేదు. వేరే గత్యంతరం లేక  ఐదు నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని అసిమ్ దేవశర్మ బెంగాల్‌లోని సిలిగురి నుండి  తన స్వస్థలమైన కలియాగంజ్ చేరుకోవడానికి బస్సులో బయలుదేరాడు. కలియాగంజ్‌లోని వివేకానంద కూడలికి చేరుకోగానే, అసిమ్ దేవశర్మ సహాయం కోరాడు. అక్కడ ఓ వ్యక్తి అతనికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశాడు.

అసిమ్ దేవశర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఆరు రోజుల పాటు సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందిన తర్వాత నా ఐదు నెలల కుమారుడు గత రాత్రి చనిపోయాడు. అప్పటికే తాను ఆ చిన్నారి వైద్యం రూ. 16,000 ఖర్చు చేశానని దుఃఖిస్తూ చెప్పారు. తాను ఓ అంబులెన్స్‌ని అద్దెకు తీసుకోవడానికి వెళ్లగా.. ఆ అంబులెన్స డైవర్ వింత సమాధానమిచ్చారట.  మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి తనకు అనుమతి లేదని, రోగులకు మాత్రమే ఈ సదుపాయం ఉచితం, కానీ శవాలను రవాణా చేయడానికి కాదని అంబులెన్స్ డ్రైవర్ బదులిచ్చారని అసిమ్ దేవశర్మ తెలిపారు.

చనిపోయిన తన బిడ్డ మృతదేహాన్ని తరలించినందుకు రూ. 8000 అని  మరో డ్రైవర్‌ను అడిగాడనీ, అంబులెన్స్ డ్రైవర్ డిమాండ్ చేసిన చేసినంతా డబ్బు తన దగ్గర లేదనీ, కాబట్టి తాను సిలిగురిలో బస్సు ప్రయాణించానని తెలిపారు. డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని కలియాగంజ్‌కు ఎవరికీ తెలియకుండా తాను బస్సులో ప్రయాణించానని, సిబ్బంది సహ-ప్రయాణికులు ఈ విషయం తెలుసుకుంటే తననీ ఎక్కడ దిగిపోమంటారో అనే భయంతో ప్రయాణించానని తెలిపారు. కలియాగంజ్‌లోని వివేకానంద కూడలిలో దిగిన తర్వాత, తాను ఒక వ్యక్తిని సంప్రదించాననీ, అతను అంబులెన్స్‌ను ఏర్పాటు చేశాడని ఆ తండ్రి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios