Supreme Court: వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కుల చుట్టూ కనీసం 1 కిమీ బఫర్ జోన్‌లో మైనింగ్ లేదా ఫ్యాక్టరీలు ఉండకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది, పర్యావరణ సున్నిత ప్రాంతాలలో మరియు చుట్టుపక్కల కార్యకలాపాలను నియంత్రించడంపై పలు ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court: పర్యావరణానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న రక్షిత అడవులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కులకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి మైనింగ్, పరిశ్రమల నిర్మాణం చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది.
దేశవ్యాప్తంగా ఎకో-సెన్సిటివ్ జోన్‌లు (ESZ పర్యావరణ సున్నిత మండలాలు), చుట్టుపక్కల కార్యకలాపాలను నియంత్రించడంపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. ఈ మేరకు శుక్రవారం.. ESZ జోన్‌కు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని స్పష్టం చేసింది. ESZ పరిధిలో జరిగే తయారీ, తయారీ సంబంధిత కార్యకలాపాలు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతితో మాత్రమే నిర్వహించాలని పేర్కొంది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కులకు చుట్టూ 1 కి.మీ మేర పర్యావరణ సున్నిత మండలం (ఎకో-సెన్సిటివ్ జోన్ ESZ ) ఉంటుంది. ఈ ESZ లో ఎలాంటి మైనింగ్ లేదా కాంక్రీట్ నిర్మాణాలు ఉండరాదని స్పష్టం చేసింది.
అలాగే..ప్రతి రాష్ట్రంలో ఎకో-సెన్సిటివ్ జోన్ ESZ కింద ఇప్పటికే ఉన్న నిర్మాణాల జాబితాను అటవీ సంరక్షణ చీఫ్ కన్జర్వేటర్ తయారు చేసి 3 నెలల వ్యవధిలో సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కుల ESZ లలో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగరాదని పేర్కొంది. దేశవ్యాప్తంగా ESZ మరియు చుట్టుపక్కల కార్యకలాపాలను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. రక్షిత అడవులు, జాతీయ ఉద్యానవనాలకు సంబంధించిన సమస్యలపై దాఖలైన పిటిషన్‌పై ఈ ఆదేశాలు వచ్చాయి.
