Asianet News TeluguAsianet News Telugu

పబ్లిగ్గా ముద్దుల్లో మునిగితేలుతున్న జంటలు.. చూడలేక ఆ కాలనీవాసులు చేసిన పని...

ఇలాంటి వారికి ముంబైలోని బోరీవలీలో సత్యం, శివం, సుందరం సొసైటీ ఎదురుగా ఉన్న రహదారి చక్కని పరిష్కారంగా కనిపించింది. ఇంకేముంది ప్రేమికులు ఆగుతారా? సాయంత్రం 5 గంటలు కాగానే టూ వీలర్లు, కార్లలో అక్కడికి ప్రేమపక్షులు వాలుతున్నాయి. ఈ జంటలు చీకటి పడేవరకు కబుర్లు చెప్పుకోవడం.. పనిలో పనిగా ముద్దుమురిపాలలో మునిగి తేలడం చేస్తున్నారు.

No kissing zone : Housing society in Mumbai marks area to discourage public displays of affection
Author
hyderabad, First Published Aug 2, 2021, 11:52 AM IST

ప్రేమికుల పాలిట కరోనా శాపంగా మారింది. కరోనా కారణంగా పార్కులు మూతపడ్డాయి. అంతేకాదు సముద్ర తీరాల్లో కూడా ఎక్కువ సేపు గడిపే వీలు లేకుండా పోయింది. జనారణ్యంలో ప్రేమికులకు కాసింత ఏకాంతం దొరకకుండా పోయింది. 

ఇలాంటి వారికి ముంబైలోని బోరీవలీలో సత్యం, శివం, సుందరం సొసైటీ ఎదురుగా ఉన్న రహదారి చక్కని పరిష్కారంగా కనిపించింది. ఇంకేముంది ప్రేమికులు ఆగుతారా? సాయంత్రం 5 గంటలు కాగానే టూ వీలర్లు, కార్లలో అక్కడికి ప్రేమపక్షులు వాలుతున్నాయి. ఈ జంటలు చీకటి పడేవరకు కబుర్లు చెప్పుకోవడం.. పనిలో పనిగా ముద్దుమురిపాలలో మునిగి తేలడం చేస్తున్నారు.

అయితే ఇది ప్రేమికులకు బాగానే ఉన్నా.. ఎదురుగా ఉంటున్న బిల్డింగుల్లోని వారికి మాత్రం ఈ దృశ్యాలు పదే పదే చూడాల్సి రావడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. దీంతో మొబైల్ ఫోన్లలో ఒకటి రెండు సార్లు.. ‘ఈ సీన్లు’.. చిత్రీకరించి స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్లి చూపించారు. తమ సమస్యలను వివరంచారు. 

ఆ తరువాత ఆయన సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచీ పెద్దగా చర్యలు లేకపోవడంతో అంతా చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు. రోడ్డు మీద ‘నో కిస్సింగ్ జోన్’ అని రాయించారు. అంతే దెబ్బకు అక్కడికి వచ్చే జంటల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో సత్య, శివం, సుందరం సొసైటీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios