వాళ్లు వచ్చి చెప్పిన తర్వాతే అతను వెళ్లి బ్యాంకులో చెక్ చేసుకున్నాడట. నిజంగానే రూ.100కోట్లు కనిపించే సరికి షాకయ్యాడు. ఆ డబ్బులు ఎవరు పంపారో కూడా అతనికి తెలీకపోవడం గమనార్హం.
ఒక్కోసారి అదృష్టం వచ్చింది అని సంబరపడేలోగా, దురదృష్టం వెంటాడుతుంది. ఓ రోజుకూలీ విషయంలో అదే జరిగింది. రాత్రి పడుకునే ముందు అతని ఎకౌంట్ లో రూ.17 ఉండగా, తెల్లారే సరికి రూ.100కోట్లు వచ్చిపడ్డాయి. వారి జీవితంలో ఊహించని పరిణామం అది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ కి చెందిన మహ్మద్ నసీరుల్లా మండల్ అనే వ్యక్తి రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రాత్రి అనుకోకుండా అతని ఎకౌంట్ లో రూ.100కోట్లు వచ్చి పడ్డాయి. ఆ రోజు అతను పడుకోవడానికి ముందు కనీసం రూ.100 కూడా లేవు. అలాంటిది సడెన్ గా రూ.100కోట్లు పడటంతో అతని కుటుంబం నమ్మలేదు. అసలు అతని ఎకౌంట్ లో అంత డబ్బు పడింది అన్న విషయం కూడా అతనికి తెలీదు. సైబల్ సెల్ డిపార్ట్‌మెంట్ అధికారులు మండల్ ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు వచ్చేంత వరకు వారి ఎకౌంట్ లో అంత డబ్బు ఉంది అన్న విషయం కూడా ఎవరికీ తెలీదు.
వాళ్లు వచ్చి చెప్పిన తర్వాతే అతను వెళ్లి బ్యాంకులో చెక్ చేసుకున్నాడట. నిజంగానే రూ.100కోట్లు కనిపించే సరికి షాకయ్యాడు. ఆ డబ్బులు ఎవరు పంపారో కూడా అతనికి తెలీకపోవడం గమనార్హం. ఆ డబ్బు పడకముందు అతని ఖాతాలో రూ.17 ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పడం విశేషం.
అయితే, ఆ డబ్బు విషయంలో అధికారులు తమను ఎమైనా ఇబ్బంది పడతారమో అని మండల్, అతని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. తమ దగ్గర అంత డబ్బు ఉందనే ఆనందం కూడా తమకు లేదని వారు బాధపడుతుండటం గమనార్హం.
బ్యాంక్ అధికారులు తన ఖాతాను బ్లాక్ చేశారని, కేసు నమోదవ్వడంతో ఇంతకుమించి వివరాలు ఇవ్వలేమని బ్యాంక్ వాళ్లు చెబుతున్నారని వాపోయాడు. ఈ డబ్బు ఎవరిదైతే వాళ్లు తీసుకోవచ్చునని, ఇంత డబ్బుతో తానేం చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా నసీరుల్లా మండల్ ముర్షిదాబాద్‌లోని బసుడెబ్‌పుర్ గ్రామానికి చెందిన వ్యక్తి. రోజు కూలీగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రూ.100 కోట్లు ఖాతాలో పడ్డ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
